
గోపీచంద్, కాజల్ అగర్వాల్
ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు అవుతున్నా కెరీర్‌లో కాజల్ అగర్వాల్ జోరు, క్రేజు ఏ మాత్రం తగ్గడం లేదు. ఆల్రెడీ కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు కాజల్. ఇటీవల రవితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కనకదుర్గ’ (వర్కింగ్ టైటిల్ అని తెలిసింది) సినిమాలో కాజల్ ఒక కథానాయికగా ఎంపిక అయ్యారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా గోపీచంద్ సరసన ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. గోపీచంద్ హీరోగా బిన్ను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
బీవీఎస్‌ఎన్. ప్రసాద్ నిర్మిస్తారు. ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో కథానాయికగా కాజల్‌ను తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉందట. ఇప్పటివరకూ గోపీచంద్. కాజల్ కలసి నటించలేదు. మరి ఈ కొత్త జోడీ షురూ అయిందా అనేది తెలియడానికి కొన్ని రోజులు పడుతుంది. ఇక హిందీ హిట్ ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’, అలాగే తేజ దర్శకత్వంలో రూపొందిన ‘సీత’ కాజల్ అగర్వాల్ నెక్ట్స్ రిలీజ్‌లు. ‘సీత’లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment