టాలీవుడ్ యంగ్ హీరోల్లోని అతికొద్ది మంది నటుల్లో శర్వానంద్ ఒకరు. చేసే ప్రతీ సినిమాలో తన ప్రత్యేకతను చాటుకుంటాడు. రీసెంట్‌గా హను రాఘవపూడి డైరెక్షన్‌లో వచ్చిన ‘పడి పడి లేచే మనసు’ ఆంతగా ఆకట్టుకోలేకపోయినా.. మరో చిత్రంతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.
విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి కొన్ని పోస్టర్స్ లీక్ అయ్యాయి. పూర్తి గడ్డంతో ఉన్న శర్వానంద్ లుక్ అదిరిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో శర్వానంద్ రెండు డిఫరెంట్ గెటప్‌లో నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్, కళ్యాణీ ప్రియదర్శిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. శర్వానంద్ ఈ చిత్రం తరువాత తమిళ హిట్ మూవీ ‘96’ రీమేక్‌లో నటించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment