
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న శర్వానంద్ ఓ ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు సినిమా చేస్తున్న శర్వానంద్.. తరువాత సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. స్వామి రారా, కేశవ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ.. శర్వానంద్‌తోనూ ప్రయోగాత్మక చిత్రం చేయనున్నాడు.
వీరి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా రెడ్ లైట్ ఏరియా నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. యంగ్ జనరేషన్ హీరోల్లో ఇంత వరకు ఇలాంటి నేపథ్యంతో ఎవరూ సినిమా చేయకపోవటంతో సుధీర్,శర్వాల సినిమాలపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హలో ఫేం కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తుండగా కాజల్ అగర్వాల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment