
శర్వానంద్
వైజాగ్‌లో సెటిల్‌మెంట్ కంప్లీట్ చేశారు శర్వానంద్. నెక్ట్స్ సెటిల్‌మెంట్ హైదరాబాద్‌లో చేస్తారట. సెటిల్‌మెంట్ చేయడమేంటి? అనుకుంటున్నారా! మరి గ్యాంగ్‌స్టర్ చేసేది సెటిల్‌మెంట్సే కదా. అర్థం కాలేదా? విషయం ఏంటంటే సుధీర్ వర్మ డైరెక్షన్‌లో శర్వానంద్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని తెలిసిందే.
అందుకే ఈ సెటిల్‌మెంట్స్. వైజాగ్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన చిత్రబృందం నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల 27 నుంచి హైదరాబాద్‌లో స్టార్ట్ చేయనుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో డిజైన్ చేసిన భారీ సెట్‌లో ఈ షెడ్యూల్ జరగనుందని సమాచారం. శర్వానంద్ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నారు. నలభై ఏళ్లున్న పాత్రలో, యంగ్ లుక్‌లో కనిపిస్తారట. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్. నాగ వంశీ, పీడీవి ప్రసాద్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment