
శర్వానంద్
యంగ్ హీరో శర్వానంద్ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాతో బిజీ అవుతున్నాడు. ఇటీవల హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు సినిమాను పూర్తి చేసిన శర్వా, ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో శర్వా మాఫీయా డాన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కళ్యాణీ ప్రియదర్శన్‌ను ఇప్పటికే ఫైనల్ చేశారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్‌ను పాత్రకు సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను సంప్రదించారట. అయితే కాజల్ శర్వాకు జోడిగా నటిస్తుందా..? లేదా.? అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment