
రెండేళ్ల క్రితం తమిళంలో విడుదలైన ‘విక్రమ్ వేదా’ చిత్రానికి అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పుష్కర్ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్ ఎస్. శశికాంత్ నిర్మించారు. పోలీసాఫీసర్ విక్రమ్ పాత్రలో మాధవన్, గ్యాంగ్‌స్టర్ వేదా పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తారు. తమిళంలో ‘విక్రమ్‌వేదా’ చేసిన ఎస్. శశికాంతే తెలుగు రీమేక్‌ను నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఇందులో విక్రమ్ పాత్రను రవితేజ చేయనున్నారని సమాచారం. వేద పాత్ర కోసం కొంతమంది నటులను పరిశీలిస్తున్నారు. మరోవైపు స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ‘డిస్కో రాజా’ సినిమాతో బిజీగా ఉన్నారు రవితేజ. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి విక్రమ్ పాత్రలోకి వచ్చేస్తారని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘విక్రమ్‌వేదా’ చిత్రం హిందీలో కూడా రీమేక్ కానుంది. ఈ చిత్రానికి ఒరిజినల్ డైరెక్టర్స్ పుష్కర్ గాయత్రి ద్వయమే దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment