రావణాసుర నుంచి కొత్త అప్​డేట్​.. రంగంలోకి | Ravi Teja Step Into Ravanasura Movie Sets | Sakshi
Sakshi News home page

Ravi Teja: రావణాసుర నుంచి కొత్త అప్​డేట్​.. రంగంలోకి

Published Thu, Feb 3 2022 7:54 AM | Last Updated on Thu, Feb 3 2022 8:01 AM

Ravi Teja Step Into Ravanasura Movie Sets - Sakshi

Ravi Teja Step Into Ravanasura Movie Sets: మాస్​ మహారాజా రవితేజ కేరీర్ పరంగా ఫుల్​ జోష్​ మీదున్నాడు. 'క్రాక్​'తో బ్లాక్​ బస్టర్ హిట్​ అందుకున్న రవితేజ ఏకంగా 5 సినిమాలు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అందులో రెండు చిత్రాల షూటింగ్​ దాదాపుగా పూర్తయింది. ఇక రమేశ్ వర్మ దర్శకత్వంలో వస్తున్న 'ఖిలాడి' సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రవితేజ 70వ చిత్రంగా వస్తోంది 'రావణాసుర'. ఈ మూవీకి సుధీర్​ వర్మ డైరెక్టర్​. తాజాగా ఈ సినిమా నుంచి అప్​డేట్ ఇచ్చింది చిత్రబృందం.​

ఈ సినిమా కోసం రంగంలోకి దిగాడు రవితేజ. 'రావణాసుర' రెండో షెడ్యూల్​ బుధవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా రవితేజతోపాటు మిగిలిన ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మాస్​ మహారాజా సెట్​లోకి అడుగు పెట్టిన వీడియో, ఫొటోలను సోషల్​ మీడియా ద్వారా పంచుకుంది చిత్రబృందం. అను ఇమ్మాన్యుయేల్​, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్​, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ న్యాయవాదిగా అలరించనున్నాడు. అలాగే ముఖ్య పాత్రలో యంగ్​ హీరో సుశాంత్​ ఆకట్టుకోనున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్​ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement