కేథరిన్ థెరిస్సా, దీపికా పదుకోన్, ప్రగ్యా జైస్వాల్,
► ‘‘జీవితంలో ఏదీ ఈజీ కాదు.. ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదు’’ అని రజనీకాంత్ చెప్పిన ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది?
ఎ) నరసింహా బి) అరుణాచలం సి) శివాజీ డి) లింగ
► మహేశ్‌బాబును తెలుగు తెరకు హీరోగా పరిచయం చేసిన దర్శకుడెవరు?
ఎ) వైవీయస్ చౌదరి బి) కె. రాఘవేంద్రరావు సి) బి. గోపాల్ డి) గుణశేఖర్
► ఎన్టీఆర్–ఏయన్నార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలెన్ని?
ఎ) 18 బి) 16 సి) 14 డి) 10
► ఈ మధ్యనే 50 చిత్రాల క్లబ్‌లో చేరిన సంగీత దర్శకుడెవరో చెప్పుకోండి ?
ఎ) యస్.యస్. తమన్ బి) అనూప్ రూబెన్స్ సి) అనిరుథ్ డి) యం.యం. కీరవాణి
► ఈ ప్రముఖ హీరో కాలిపాదం సైజు 13వ నంబర్. ఇండియాలో ఈ నంబరు చెప్పులు దొరకడం చాలా కష్టం. అందుకే ఈయన దుబాయ్ వెళ్లినప్పుడల్లా సూట్‌కేస్ నిండా చెప్పులతో తిరిగొస్తారు. ఆ లాంగ్ ఫుట్ హీరో ఎవరబ్బా?
ఎ) ప్రభాస్ బి) మహేశ్‌బాబు సి) రానా డి) వరుణ్‌తేజ్
► ఈ మధ్యే చనిపోయిన పాత తరం నటి ‘కృష్ణకుమారి’ ఒక ప్రముఖ హీరోయిన్ చెల్లెలు. ఎవరా హీరోయిన్?
ఎ) శారద బి) షావుకారు జానకి సి) సావిత్రి డి) జమున
► దీపికా పదుకోన్ మాజీ ప్రియుడు పేరు ‘ఆర్’ అక్షరంతో మొదలవుతుంది. తాజా ప్రియుడి పేరూ అదే అక్షరంతో మొదలవుతుందని హింటిచ్చారు. ఆ ‘ఆర్’ ఎవరో కనుక్కోండి చూద్దాం?
ఎ) రణ్‌బీర్ కపూర్ బి) రణ్‌వీర్ సింగ్ సి) రాజ్‌కుమార్ రావు డి) రణ్‌దీప్ హుడా
► దుబాయ్‌లో పుట్టింది ఈ మలయాళీ భామ మొదటి తెలుగు చిత్రం ‘చమ్మక్ చల్లో’. ఇప్పుడు చాలా సినిమాల్లో బిజీ హీరోయిన్. ఎవరామె?
ఎ) కేథరిన్ థెరిస్సా బి) ప్రగ్యా జైస్వాల్ సి) హెబ్బా పటేల్ డి) అనూ ఇమ్మాన్యుయేల్
► ‘అపుడో, ఇపుడో, ఎపుడో కలగన్నానే చెలి..’ అనే పాట ‘బొమ్మరిల్లు’ సినిమాలోనిది. ఆ పాట రచయితెవరు?
ఎ) సాహితి బి) జొన్నవిత్తుల సి) శ్రీమణి డి) అనంత శ్రీరామ్
► ‘కాస్టింగ్ కౌచ్’ గురించి నిర్భయంగా మాట్లాడుతున్న హీరోయిన్ ఈమె. ఆమె పాటలు కూడా పాడతారు. ఎవరా హీరోయిన్?
ఎ) భావన బి) ఆండ్రియా సి) అంజలి డి) అమీ జాక్సన్
► ‘స్వాతిముత్యం’ చిత్రంలో బాల నటుడిగా నటించిన ఈ నటుడు ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ స్టార్? ఎవరా హీరో కనుక్కోండి?
ఎ) అల్లు అర్జున్ బి) రామ్‌చరణ్ సి) యన్టీఆర్ డి) కల్యాణ్‌రామ్
► వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ సినిమా నిర్మాత ఎవరు?
ఎ) కృష్ణవంశీ బి) జె.డి. చక్రవర్తి సి) రామ్‌గోపాల్‌వర్మ డి) గుణశేఖర్
► ప్రస్తుతం విక్రమ్ సరసన ఓ సినిమా కమిట్ అయిన ప్రముఖ కథానాయకుని కుమార్తె ఎవరు?
ఎ) శివానీ రాజశేఖర్ బి) శ్రుతీహాసన్ సి) వరలక్షీ శరత్‌కుమార్ డి) అక్షరాహాసన్
► కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘సాహసవీరుడు–సాగరకన్య’ చిత్రంలో నటించిన భాలీవుడ్ భామ ఎవరు? (ఈమెని పొడుగు కాళ్ల సుందరి అని కూడా అంటారు)
ఎ) టబు బి) ట్వింకిల్ ఖన్నా సి) శిల్పాశెట్టి డి) మనీషా కొయిరాలా
► నటుడు ఆర్.నారాయణమూర్తి ఏ చిత్రం ద్వారా హీరోగా మారారో తెలుసా?
ఎ) అర్ధరాత్రి స్వాతంత్య్రం బి) అడవి దివిటీలు సి) దండోరా డి) లాల్‌సలామ్
► రిషిబాలా నావల్ అని ఈ నటి అసలు పేరు. ఈమె సౌత్‌లో పదేళ్ల క్రితం టాప్ హీరోయిన్? ఎవరా కథానాయిక?
ఎ) త్రిష బి) స్నేహ సి) సిమ్రాన్ డి) శ్రియ
► ‘అర్జున్‌రెడ్డి’ చిత్ర సంగీతదర్శకుని పేరేంటి?
ఎ) గోపీసుందర్ బి) సాయి కార్తీక్ సి) రామ్ నారాయణ్ డి) రథన్
► మొన్న సంక్రాంతి పండగను నాగార్జున కొత్త కోడలు సమంత అన్నపూర్ణ స్డూడియో స్టాఫ్‌తో జరుపుకున్నారు. అన్నపూర్ణ స్టూడియో ప్రారంభించి ఎన్ని సంవత్సరాలైందో తెలుసా?
ఎ) 34 బి) 28 సి) 42 డి) 38
► ‘గాయత్రి’ అనే పేరుతో వస్తున్న చిత్రంలో లీడ్ రోల్‌లో నటిస్తున్న సీనియర్ మోస్ట్ హీరో ఎవరో కనుక్కోండి?
ఎ) మోహన్‌బాబు బి) రాజేంద్రప్రసాద్ సి) జగపతిబాబు డి) సుమన్
► జియస్టీ (గాడ్, సెక్స్ అండ్ ట్రూత్) అనే షార్ట్ ఫిల్మ్‌కు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?
ఎ) జేబి బి) యం.యం. కీరవాణి సి) జిబ్రాన్ డి) కమ్రాన్
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) డి 2) బి 3) సి 4) బి 5) సి 6) బి 7) బి 8) ఎ 9) డి 10) బి 11) ఎ 12) సి 13) డి 14) సి 15) ఎ 16) సి 17) డి 18) సి 19) ఎ 20) బి
Comments
Please login to add a commentAdd a comment