
సూపర్ స్మార్ట్ శంకర్‌కి జోడీగా స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్ గాళ్ దొరికిందట. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్, చార్మీ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుందట. ఇందులో శంకర్ పాత్రలో రామ్ నటిస్తారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ క్యారెక్టర్‌ను పూరి చాలా కొత్తగా డిజైన్ చేశారట. ఇందులో హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుయేల్‌ను ఎంపిక చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటారని తెలిసింది. ఈ చిత్రం షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, మేలో సినిమాని ప్రేక్షకులకు చూపించాలని పూరి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రామ్ లుక్‌ని విడుదల చేసిన ఈ చిత్రబృందం షూటింగ్ ప్రారంభించిన వెంటనే మరో లుక్‌ని రిలీజ్ చేయాలనుకుంటున్నా రట. ఫస్ట్ లుక్ ఫుల్ మాస్. మరి.. రెండోది ఎలా ఉంటుందో?
Comments
Please login to add a commentAdd a comment