ఫారిన్‌లో డ్యూయెట్‌ | na peru surya naa illu india song shooting Foreign | Sakshi
Sakshi News home page

ఫారిన్‌లో డ్యూయెట్‌

Published Tue, Mar 20 2018 12:32 AM | Last Updated on Tue, Mar 20 2018 12:32 AM

na peru surya naa illu india song shooting Foreign - Sakshi

ఇప్పటివరకూ బార్డర్‌లో దేశం కోసం పోరాడిన సూర్య ఇప్పుడు విదేశాల్లో కొంచెం విశ్రాంతి తీసుకోనున్నారు. విశ్రాంతి ఏంటి అనుకుంటున్నారా?  ఇన్ని రోజులు యాక్షన్‌ సీక్వెన్స్‌లో పాల్గొన్న సూర్య ఇప్పుడు తన ప్రేయసితో డ్యూయెట్‌ పాడుకోవటం కోసం ఫారిన్‌ వెళ్లారట.  అల్లు అర్జున్‌ హీరోగా  వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. సోల్జర్‌ సూర్య పాత్రలో అల్లు అర్జున్‌ కనిపించనున్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్‌పై ఒక రొమాంటిక్‌ సాంగ్‌ను ఫారిన్‌లో బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో షూట్‌ చేయనున్నారట చిత్రబృందం.

మార్చి 21 నుంచి ఈ సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో ఒక స్పెషల్‌ సాంగ్‌ కూడా ఉందట. ఆ పాటకు బాలీవుడ్‌ భామ ఎలీ అవరమ్‌ డ్యాన్స్‌ చేయనున్నారు. ఈ సాంగ్‌ గురించి ఎలీ మాట్లాడుతూ – ‘‘ఇది ఐటమ్‌ సాంగ్‌ కాదు. అద్భుతమైన లిరిక్స్, మెసేజ్‌ ఉండే స్పెషల్‌ సాంగ్‌. అల్లు అర్జున్‌ డ్యాన్స్‌కు నేను పెద్ద ఫ్యాన్‌. అయితే ఈ పాటలో అల్లు అర్జున్‌ ఎక్కువ డ్యాన్స్‌ చేయరు’’ అని పేర్కొన్నారామె. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి  శిరీషా శ్రీధర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. మే 4న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement