అల్లు అర్జున్
దుమ్ము రేపాడు. ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్‌లో సూపర్బ్ పర్ఫార్మెన్స్‌తో అల్లు అర్జున్ దుమ్ము రేపాడని ప్రేక్షకులు అన్నారు. ఇప్పుడు సినిమాలోని డైలాగ్స్‌కు ఉన్న దమ్మును చూపించేందుకు చిత్రబృందం రెడీ అవుతోంది.
వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శీరీషా శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఈ నెల 8న అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా డైలాగ్ ఇంపాక్ట్ టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. సినిమా మే 4న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment