
అవును.. సూర్య ఇంట్లో పండగ చేసుకున్నారు. పండ గలంటే మనం పిండి వంటలు చేసుకుంటాం. సరదాగా కబుర్లు చెప్పుకుంటాం. మహా అయితే ఏదైనా ఆటలు ఆడతాం. అదే సినిమాల్లో అయితే వీటన్నింటితో పాటు పాటలు కూడా పాడుకుంటారు. సూర్య కూడా తన ఫ్యామిలీతో కలసి పాట పాడారు. అందరూ డ్యాన్స్ చేశారు. మనోడు స్టెప్పేశాడంటే సూపర్ అనాల్సిందే.
మరి.. అల్లు అర్జునా? మజాకా? సూర్య గురించి చెబుతూ అల్లు అర్జున్ అంటున్నారేంటి? అని అనుకోరు. ఎందుకంటే.. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ పేరుతో బన్నీ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవీ మర్చంట్ ఈ చిత్రం కోసం రెండు పాటలు కంపోజ్ చేస్తున్నారు.
ఒకటి పైన చెప్పిన ఫ్యామిలీ సాంగ్. ఇంకోటి లవ్ సాంగ్. సూర్య ఇంటి సెట్‌లో ఈ ఫ్యామిలీ సాంగ్‌ని నైట్ ఎఫెక్ట్‌లో తీశారు. ఈ పాటలో కీలక తారాగణంతో పాటు వంద మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. ప్రస్తుతం రొమాంటిక్ సాంగ్ తీస్తున్నారు. ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment