కార్తి, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘జపాన్’. రాజా మురుగన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కార్తి ఇంట్రో వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో కార్తి క్రేజీ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా నిజ జీవిత దొంగ ఆధారంగా రూపొందించబడింది అని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఎంత టార్చర్ పెట్టారంటే.. చచ్చిపోదామనుకున్నా)
తమిళనాడులోని చెన్నైలో లలితా జ్యువెలరీ దుకాణంలో తిరువారూర్ ముర్గన్ అనే వ్యక్తి 13 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను దోచుకున్నాడు. 2019లో జరిగిన ఈ దోపిడీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాకుండా దక్షిణాదికి చెందిన పలు రాష్ట్రాల్లో అతను దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే, మురుగన్ 2020లో జైలులో ఎయిడ్స్‌తో మరణించాడు. ఈ రియల్ దొంగోడి కథ ఆధారంగానే జపాన్ సినిమా తీస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
(ఇదీ చదవండి: ఐటం పాప బాగా రిచ్.. నైట్ డ్రెస్సుకు ఎన్ని వేలు పెట్టిందంటే?)
కానీ కథలో కొన్ని మార్పులను కార్తి సూచించాడట. మురుగన్ ఎందుకు దొంగగా మారాడు? అనేక ప్రతిష్టాత్మకమైన బంగారు ఔట్‌లెట్లలో నగలను ఎలా దోచుకున్నాడు? అనే కమర్షియల్ ఎలిమెంట్స్‌ని మేకర్స్ జోడిస్తున్నారని తెలుస్తోంది. క్లైమాక్స్ విషయంలో చిత్ర సభ్యులు పలు జాగ్రత్తలు తీసుకున్నారట. నిజజీవితంలో జరిగిన సంఘటనలను చూపించాలని కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు సుఖాంతంతో కథను ముగించాలని అభిప్రాయపడ్డారట! మరి జపాన్‌కు ఫినిషింగ్ టచ్ ఏమిచ్చారో తెలియాలంటే? ఈ దీపావళి వరకు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment