కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జపాన్’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్‌ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో దీపావళికి విడుదల కానుంది. కార్తీకి జపాన్ 25వ చిత్రం. తన కెరీయర్‌లో ఇదొక బెంచ్‌మార్క్ లాంటి మూవీ. ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుంది.
(ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు)
నాగార్జున అక్కినేని కాంపౌండ్ నుంచి ఈ సినిమా తెలుగులో విడుదల కానున్నడంతో మార్కెట్‌కు ఎలాంటి సందేహం అక్కర్లేదని చెప్పవచ్చు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి 200 కోట్ల దోపిడీకి పాల్పడే కథాంశంతో ఉంటుందని టీజర్‌తో ఒక క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా ఇండియా అంతటా జపాన్‌పై (కార్తీ పాత్ర పేరు) 182 కేసులున్నాయని, అతనొక గజదొంగ అంటూ పాత్రను రివీల్ చేశారు.
తమిళనాడులోని ఒక దొంగ జీవితాన్ని బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగార్జున- కార్తీ ఇద్దరూ కలిసి ఊపిరి సినిమాలో మెప్పించారు. ఆ సినిమా నుంచే వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. జపాన్ సినిమాను అన్నపూర్ణ సంస్థ విడుదల చేయనున్నడంతో కార్తీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. సినిమా విడుదల తప్పకుండా భారీ ఎత్తున ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment