Japan Movie
-
కార్తీలో జపాన్ తెచ్చిన మార్పు
జపాన్ అనే ఒక్క చిత్రం ద్వారా నటుడు కార్తీలో చాలా మార్పు తెచ్చిందనిపిస్తోంది. ఆయన చాలా నమ్మకం పెట్టుకున్న 25వ చిత్రం జపాన్. అయితే అందరి అంచనాలను తారు మారు చేసి చిత్రం నిరాశ పరచింది. ఇక ఇంతకు ముందెప్పూడూ లేని విధంగా కార్తీ చేతిలో 7 చిత్రాలు ఉన్నాయంటే సాధారణ విషయం కాదు. కాగా కార్తీ నటిస్తున్న 26వ చిత్రాన్ని నలన్ కుమారసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు సూదు కవ్వుమ్, కాదలుమ్ కడందు పోగుమ్ వంటి విజయవంతమైన చిత్రాలను తెర కెక్కించారు. కాగా కార్తీ 26వ చిత్రాన్ని స్డూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న చిత్రం కావడంతో దీనిపై నానాటికీ భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. కాగా శరవేగంగా నిర్మాణ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పుటికి 50 శాతం పూర్తి అయ్యిందని యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో పాటు చిత్ర ప్రారంభోత్సవ దృశాలతో కూడిన వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కథా, కథనాలను సరికొత్త బాణీలో తెరపై ఆవిష్కరించే దర్శకుడు నలన్ కుమారసామి. ఈ చిత్రాన్ని తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారని యూనిట్ వర్గాలు చెప్పారు. కాగా ఈ చిత్రంలో నటించే ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొన్నారు. -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్
మరో వారం వచ్చేసింది. మరో 10 రోజుల్లో 'సలార్' మూవీ థియేటర్లలోకి రాబోతుంది. దీంతో ఈ వీక్.. చెప్పుకోదగ్గ మూవీస్ ఏం థియేటర్లలో రిలీజ్ కావట్లేదు. దీంతో ఆటోమేటిక్‌గా మూవీ లవర్స్ దృష్టి ఓటీటీలపై పడుతుంది. సరిగ్గా దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఓటీటీ సంస్థ రెడీ అయిపోయాయి. అలా ఈ వారం ఏకంగా 32 మూవీస్.. ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో పలు తెలుగు చిత్రాలు కూడా ఉండటం విశేషం. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. కార్తీ 'జపాన్', సల్మాన్ 'టైగర్ 3' చిత్రాలు మాత్రమే అందరికీ ఆసక్తి కలిగిస్తున్నాయి. మిగతావన్నీ కూడా ఇంగ్లీష్, హిందీ సిరీసులు-సినిమాలే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇందులో స్ట్రెయిట్ మూవీస్ ఏం లేనప్పటికీ వీకెండ్ వచ్చేసరికి కొత్తగా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీస్ రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ లిస్ట్ (డిసెంబరు 10 నుంచి 17 వరకు) అమెజాన్ ప్రైమ్ టైగర్ 3 (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 12 డెత్స్ గేమ్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 15 రీచర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 15 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫలిమి (మలయాళ మూవీ) - డిసెంబరు 15 ద ఫ్రీలాన్సర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - డిసెంబరు 15 నెట్‌ఫ్లిక్స్ జపాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 11 కెవిన్ హర్ట్ & క్రిస్ రాక్: హెడ్ లైనర్స్ ఓన్లీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 12 సింగిల్ ఇన్ఫెర్నో సీజన్ 3 (కొరియన్ సిరీస్) - డిసెంబరు 12 అండర్ ప్రెజర్: ద యూఎస్ ఉమెన్స్ వరల్డ్‌కప్ టీమ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 12 1670 (పోలిష్ సిరీస్) - డిసెంబరు 13 కార్ మాస్టర్స్ రష్ టూ రిచెస్: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 13 ఇఫ్ ఐ వర్ లూయిస్ సోంజా (పోర్చుగీస్ సిరీస్) - డిసెంబరు 13 యాస్ ద క్రో ఫ్లైస్: సీజన్ 2 (టర్కిష్ సిరీస్) - డిసెంబరు 14 ద క్రోన్ సీజన్ 6: పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 14 యూ యూ హకూషో (జపనీస్ సిరీస్) - డిసెంబరు 14 క్యారోల్ & ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 15 చికెన్ రన్: డాన్ ఆఫ్ ద నగ్గెట్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 15 ఫేస్ టూ ఫేస్ విత్ ఈటీఏ: కన్వర్జేషన్స్ విత్ ఏ టెర్రరిస్ట్ (స్పానిష్ సినిమా) - డిసెంబరు 15 ఫమిలియా (స్పానిష్ మూవీ) - డిసెంబరు 15 ఐ లవ్ లిజీ (తగలాగ్ చిత్రం) - డిసెంబరు 15 శేషన్ మైక్-ఇల్ ఫాతిమా (మలయాళ మూవీ) - డిసెంబరు 15 యో! క్రిస్మస్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 15 ద రోప్ కర్స్ 3 (మాండరిన్ మూవీ) - డిసెంబరు 17 వివాంట్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 17 జియో సినిమా ద బ్లాకెనింగ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 16 ద సోవనీర్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 17 లయన్స్ గేట్ ప్లే డిటెక్టివ్ నైట్: ఇండిపెండెన్స్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 15 ఆపిల్ ప్లస్ టీవీ ద ఫ్యామిలీ ప్లాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 15 జీ 5 కూసే మునిస్వామి వీరప్పన్ (తమిళ సిరీస్) - డిసెంబరు 14 బుక్ మై షో ద పర్షియన్ వెర్షన్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 12 టేలర్ స్విఫ్ట్-ద ఈరస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 13 లైలాస్ బ్రదర్స్ (పర్షియన్ చిత్రం) - డిసెంబరు 15 వింటర్ టైడ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 15 (ఇదీ చదవండి: లేటు వయసులో పెళ్లి చేసుకున్న జైలర్ నటుడు, ఫోటోలు వైరల్) -
Japan OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న జపాన్.. వారం రోజుల్లో..
కోలీవుడ్ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ జపాన్. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహించాడు. నవంబర్ 10న భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ వద్ద విడుదలైన ఈ సినిమాకు అంతంతమాత్రమే స్పందన లభించింది. దీంతో తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిందీ మూవీ.. డిసెంబర్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. హిందీ వర్షన్ గురించి మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. జపాన్ కథేంటంటే.. జపాన్ ముని (కార్తీ) ఓ గజదొంగ. అతడు కన్నాలు వేసేచోట గుర్తుగా ఓ బంగారు కాయిన్‌ను పెట్టి వెళ్తుంటాడు. అలా ఓసారి హైదరాబాద్‌లోని రాయల్ అనే నగల దుకాణం నుంచి రూ.200 కోట్లు విలువ చేసే బంగారం కొట్టేస్తాడు. ఆ బంగారు ఆభరణాల దుకాణంలో తెలంగాణ హోమంత్రి సత్యమూర్తి(కేఎస్ రవికుమార్) షేర్ కూడా ఉండడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. స్పెషల్ ఆఫీసర్స్ భవాని(విజయ్ మిల్టన్), శ్రీధర్(సునీల్) రంగంలోకి దిగుతారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం వెతుకుతుంటారు. అసలు జపాన్ దొంగగా మారడానికి గల కారణం ఏంటి? దోచుకున్న డబ్బు, బంగారం ఏం చేశాడు? శ్రీధర్‌తో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు జపాన్‌కి ఎందుకు సహాయం చేశారు? చివరకు జపాన్ జీవితం ఎలా ముగిసింది? అన్న వివరాలు తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే! Intha kadhai-la thimingalam sikkuma sikkadha nu paaka neenga ready ah? #Japan, coming to Netflix in Tamil, Telugu, Malayalam and Kannada on 11 Dec! pic.twitter.com/rLWRBVyL6N — Netflix India South (@Netflix_INSouth) December 4, 2023 చదవండి: సిల్క్ స్మితపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మరోసారి వైరల్.. -
ఓటీటీకి స్టార్ హీరో మూవీ.. నెల రోజుల్లోపే!
కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జపాన్’. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో దీపావళి సందర్భంగా నవంబర్ 10న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. తమిళనాడులోని ఒక దొంగ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. విడుదలై నెలరోజులు కాకముందే ఓటీటీకి రానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1 న లేదా 8న నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓటీటీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ త్వరలోనే ప్రకటన చేయనున్నారు. కాగా.. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అసలు కథేంటంటే.. జపాన్ ముని అలియాస్ జపాన్(కార్తి) ఓ గజదొంగ. గోడలకు కన్నం వేసి దొంగతనం చేయడం.. గుర్తుగా అక్కడ ఓ బంగారు కాయిన్‌ను పెట్టి వెల్లడం అతని స్పెషాలిటీ. ఓ సారి హైదరాబాద్‌లోని రాయల్ అనే నగల దుకాణం నుంచి రూ. 200 కోట్ల విలువ చేసే గోల్డ్‌ని కొట్టేస్తారు. ఆ గోల్డ్ షాపులో తెలంగాణ హోమంత్రి సత్యమూర్తి(కేఎస్ రవికుమార్) షేర్ కూడా ఉండడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఈ కేసు విచారణకై స్పెషల్ ఆఫీసర్స్ భవాని(విజయ్ మిల్టన్), శ్రీధర్(సునీల్) రంగంలోకి దిగుతారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ దొంగతనం ఎవరు చేశారు? జపాన్ దొంగగా మారడానికి గల కారణం ఏంటి? దోచుకున్న డబ్బు, బంగారం ఏం చేశాడు? శ్రీధర్‌తో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు జపాన్‌కి ఎందుకు సహాయం చేశారు? పోలీసులకు చెందిన రహస్యాలు జపాన్ దగ్గర ఏం ఉన్నాయి? చివరకు జపాన్ జీవితం ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే జపాన్ సినిమా చూడాల్సిందే. -
జపాన్ డిజాస్టర్‌తో కీలక నిర్ణయం తీసుకున్న కార్తి
కోలివుడ్లో కార్తి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే గుర్తింపు ఉంది. తాజాగా ఆయన నటించిన జపాన్ సినిమా దీపావళి కానుకగా విడుదలైంది. రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. స్క్రీన్‌ప్లే, మేకింగ్ విషయంలో సినిమా పూర్తిగా ఫెయిల్ అయిందని టాక్ రావడం వల్ల జపాన్‌కు వ్యతిరేక రివ్యూలు వచ్చాయి. దీంతో జపాన్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో కార్తీ కీలక నిర్ణయం తీసుకుని తదుపరి దశకు సిద్ధమయ్యాడు. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు) నవంబర్ 10వ తేదీన విడుదలైన జపాన్ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా రూ. 23.34 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 12.15 కోట్లు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది. సుమారు రూ. 27 కోట్లకు పైగా నష్టం రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కార్తి కెరియర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా జపాన్ నిలిచింది. కార్తికి 25వ సినిమాగా జపాన్ విడుదలైంది. మొదటి ఆట నుంచే నెగిటివ్‌గా ట్రోల్స్ రావడంతో కార్తీ కూడా కీలక నిర్ణయం తీసుకుని అందుకు తగ్గట్టుగానే తన 27వ సినిమా షూటింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కోలివుడ్ బిగ్గెస్ట్ హిట్ సినిమా అయిన '96'తో ఫేమస్ అయిన డైరెక్టర్ ప్రేమ్‌కుమార్‌తో సినిమా షూటింగ్‌ను నేడు ప్రారంభించనున్నాడు. ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2డి సంస్థ నిర్మిస్తోంది. ఈ సందర్భంలో, కార్తీ 27 షూటింగ్ నేటి నుంచి కుంభకోణంలో ప్రారంభమవుతుంది. ఇందులో కార్తీతో పాటు అరవింద్ సామీ కూడా నటించనున్నాడని సమాచారం. ఈరోజు ప్రారంభం కానున్న షూటింగ్ కూడా శరవేగంగా జరగనుందని అంటున్నారు. అదే సమయంలో ఈ సినిమాలో కార్తీ సరసన ఎవరు నటిస్తారనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మరోవైపు నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కార్తీ 26లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తున్న కార్తీ.. జపాన్‌తో వచ్చిన డ్యామేజిని కంట్రోల్ చేసే పనిలో కార్తి ఉన్నాడని తెలుస్తోంది. -
తుస్సుమన్న కొత్త సినిమాలు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
ప్రతివారంలానే ఈసారి కూడా కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. కాకపోతే చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ లేకపోవడంతో డబ్బింగ్ చిత్రాలే ప్రేక్షకులకు దిక్కయ్యాయి. అలా తాజాగా కార్తీ 'జపాన్'తో పాటు 'జిగర్ తాండ డబుల్ ఎక్స్' అనే రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. వీటికి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అందుకు తగ్గట్లే తొలిరోజు కలెక్షన్స్ కూడా దారుణంగా వచ్చినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: Japan Review: ‘జపాన్’ మూవీ రివ్యూ) 'ఆవారా', 'యుగానికొక్కడు'. 'ఖైదీ' లాంటి డిఫరెంట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కార్తీ తాజాగా 'జపాన్' సినిమాతో వచ్చాడు. అయితే దొంగ-పోలీస్ కథతో తీసిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో దారుణంగా ఫెయిలైంది. రివ్యూలు అన్ని అలానే వచ్చాయి. దీంతో తొలిరోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.కోటి మాత్రమే వచ్చిందట. తమిళంలో మాత్రం రూ.3.5 కోట్ల పైనే వసూళ్లు వచ్చినట్లు సమాచారం. అలా ఓవరాల్‌గా రూ.5 కోట్ల లోపే కలెక్షన్ వచ్చాయి. వీకెండ్ లో కాస్తోకూస్తో డబ్బులు వస్తాయి తప్పితే లాంగ్ రన్ లో నష్టాలు రావడం గ్యారంటీ! ఇకపోతే డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తీసిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. ఇది కూడా 'జపాన్'లానే తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. లారెన్స్, ఎస్జే సూర్య యాక్టింగ్ బాగానే ఉన్నప్పటికీ కంటెంట్ ల్యాగ్ ఉండటం సినిమాకు మైనస్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి తొలిరోజు మొత్తంగా రూ.1.75 కోట్లు మాత్రమే వసూళ్లు దక్కినట్లు తెలుస్తోంది. ఇలా దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చిన డబ్బింగ్ చిత్రాలు తుస్సుమనిపించాయి. (ఇదీ చదవండి: 'జిగర్ తండ డబుల్ ఎక్స్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?) -
జపాన్ మూవీ రివ్యూ
-
Japan Review: ‘జపాన్’ మూవీ రివ్యూ
టైటిల్: జపాన్ నటీనటులు: కార్తి, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్ తదితరులు నిర్మాణ సంస్థ: : డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు దర్శకత్వం: రాజు మురుగన్ సంగీతం: జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫి: ఎస్. రవి వర్మన్ ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్ విడుదల తేది: నవంబర్ 10, 2023 కథేంటంటే.. జపాన్ ముని అలియాస్ జపాన్(కార్తి) ఓ గజదొంగ. గోడలకు కన్నం వేసి దొంగతనం చేయడం.. గుర్తుగా అక్కడ ఓ బంగారు కాయిన్‌ను పెట్టి వెల్లడం అతని స్పెషాలిటీ. ఓ సారి హైదరాబాద్‌లోని రాయల్ అనే నగల దుకాణం నుంచి రూ. 200 కోట్ల విలువ చేసే గోల్డ్‌ని కొట్టేస్తారు. ఆ గోల్డ్ షాపులో తెలంగాణ హోమంత్రి సత్యమూర్తి(కేఎస్ రవికుమార్) షేర్ కూడా ఉండడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఈ కేసు విచారణకై స్పెషల్ ఆఫీసర్స్ భవాని(విజయ్ మిల్టన్), శ్రీధర్(సునీల్) రంగంలోకి దిగుతారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ దొంగతనం ఎవరు చేశారు? జపాన్ దొంగగా మారడానికి గల కారణం ఏంటి? దోచుకున్న డబ్బు, బంగారం ఏం చేశాడు? శ్రీధర్‌తో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు జపాన్‌కి ఎందుకు సహాయం చేశారు? పోలీసులకు చెందిన రహస్యాలు జపాన్ దగ్గర ఏం ఉన్నాయి? చివరకు జపాన్ జీవితం ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘జపాన్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కార్తి నటించిన 25వ సినిమా కావడంతో ‘జపాన్’పై ముందు నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ చిత్రం కచ్చితంగా ఢిపరెంట్‌గా ఉంటుందని భావించారు. అయితే సినిమా మాత్రం ఆ రేంజ్లో లేదనే చెప్పాలి. ఓ భారీ నగల దుకాణంలో దొంగతనం సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఈ కేసును ఛేదించడానికి భవానీ, శ్రీధర్ పాత్రలు రావడం..వారికి సంబంధించిన సీన్స్ చూసి ఇది సీరియస్‌గా సాగే పోలీసు-దొంగ కథలా అనిపిస్తుంది. అయితే హీరో ఎంట్రీ తర్వాత మాత్రం ఇది క్యాట్- మౌస్ తరహాలో సాగే యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ అని అర్థమవుతుంది. దొంగతనం చేసిన డబ్బులతో హీరోగా సినిమాలు చేసే వ్యక్తిగా కార్తిని పరిచయం చేశారు. కార్తి డైలాగ్ డెలివరీ, గెటప్ రెండూ డిఫరెంట్‌గా ఉండడంతో కథపై ఆసక్త పెరుగుతుంది. ఒక పక్క జపాన్ స్టోరీ నడిపిస్తూనే.. మరోపక్క ఇన్వెస్టిగేషన్ పేరుతో సామాన్యుడు గంగాధర్‌ని పోలీసులు పెట్టే టార్చర్‌ని చూపిస్తూ.. ఏదో జరుగబోతుందనే ఆసక్తిని కలిగించారు. ఊహించని ట్విస్టులేవో ఉంటాయనుకున్న ప్రేక్షకుడి అక్కడ నిరాశే కలుగుతుంది. హీరోకి ఎయిడ్స్ ఉందని స్టార్టింగ్‌లోనే చెప్పించి.. ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిగించారు. కానీ దానికి సరైన ముగింపు ఇవ్వలేదు. వెన్నుపోటు సన్నివేశాలను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. ఇక హీరోయిన్ సంజుతో జపాన్ లవ్‌ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ కొన్ని చోట్ల మాత్రమే నవ్విస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమా కథ అంటూ తను దొంగగా ఎందుకు మారాడో చెప్పే సీన్ ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఎమోషనల్‌కు గురిచేస్తాయి. ఎవరెలా చేశారంటే.. కార్తి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తాడు. జపాన్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన గెటప్, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంటాయి. సినిమా కోసం కార్తి పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. హీరోయిన్ సంజు పాత్రకు అను ఇమ్మాన్యుయేల్ ఉన్నంతలో న్యాయం చేసింది. ఆ పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. పోలీసు అధికారి శ్రీధర్‌గా సునీల్ కొన్ని చోట్ల భయపెట్టాడు..మరికొన్ని చోట్ల తేలిపోయాడు. అయితే ఆయన పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. భవాని పాత్రకు విజయ్ మిల్డన్ న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. జపాన్ కోసం పోలీసులు అరెస్ట్ చేసిన సామాన్యుడు గంగాధర్ పాత్రను పోషించిన వ్యక్తి నటన బాగుంది. కెఎస్ రవికుమార్‌తో పాటు మిగిలి నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం పర్వాలేదు. పాటలు ఆకట్టుకోలేదు కానీ నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సిందే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Japan Twitter Review : ‘జపాన్’ ట్విటర్ రివ్యూ
విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో కార్తి. కథలో కొత్తదనం..పాత్రలో వైవిధ్యం ఉండే చిత్రాల్లోనే నటిస్తాడు. అందుకే నటుడిగా కెరీర్ ప్రారంభించి దాదాపు 20 ఏళ్లు అవుతున్నా..ఇప్పటికి కేవలం 24 చిత్రాలను మాత్రమే పూర్తి చేశాడు. ఆయన హీరోగా నటించిన 25వ చిత్రం ‘జపాన్’. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్లో కూడా ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో ‘జపాన్’పై ఇక్కడ కూడా భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా నేడు(నవంబర్ 10) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. జపాన్ మూవీ ఎలా ఉంది? స్టోరీ ఏంటి? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ‘జపాన్’ చిత్రానికి ఎక్స్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ చిత్రం బాగుందని కొంతమంది చెబుతుంటే... మరికొంత మంది బాగోలేదని కామెంట్ చేస్తున్నారు. జపాన్ #Japan A well executed heist movie from #Rajmurugan#Karthi just nailed it in this character..🥰🥰 An above average first half followed by good top second half ..🤝🤝 Bgm by #GVPrakash works 💥💥 Vishuals 🔥🔥#Japanmovie #JapanReview#Karthi #AnuEmmanuel#Rajmurugan pic.twitter.com/O6AHSPRDix — Neha Upa (@NehaUpa19061714) November 9, 2023 హీస్ట్ మూవీ జపాన్ను దర్శకుడు రాజ్ మురుగన్ అద్బుతంగా తీశాడు. ఫస్టాఫ్ యావరేజ్‌గా, సెకండాఫ్ టాప్ లేపింది. కార్తి తన పాత్రలో ఒదిగిపోయాడు. జీవీ ప్రకాశ్ సంగీతం సూపర్‌గా ఉంది. సినిమాటోగ్రఫి అదరగొట్టింది అని నెటిజన్ ట్వీట్ చేశాడు. Cringe பய #karthi ன்.. மொக்க படம் #Japan Utter flop ஆக மனதார வாழ்த்துகிறேன்..#JapanMovie #JapanFromTomorrow #JapanDiwali #JigarthandaDoubleX #JigarthandaDoubleXfromNov10 pic.twitter.com/uqpXgpfnhM — Manikandan (@Mani20081996) November 9, 2023 జపాన్ క్రింజ్‌లా ఉందని, అట్టర్ ఫ్లాప్ మూవీ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. #JapanReview#Japan Its a story of a heist & a cat-mouse chase action comedy entertainer by mixed with romance, emotions #Karthi just show his best in the epic entertainer Dynamic scenes are filmed by extremely well blended with an epic bgm by #GVPrakash My Rating 🌟4/5 pic.twitter.com/EKxCl8HzQY — Haritha (@Pt54936312) November 9, 2023 జపాన్ సినిమా హీస్ట్, క్యాట్- మౌస్ తరహాలో సాగే యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో రొమాన్స్, ఎమోషన్స్ మిక్స్ చేశారు. కార్తీ ఫెర్ఫార్మెన్స్‌తో ఎపిక్ ఎంటర్టైనర్గా మారింది. డైరెక్టర్ సీన్లను అద్బుతంగా తీశాడు. జీవీ ప్రకాశ్ మూవీ ఈ సినిమా హైలెట్ అంటూ 4 రేటింగ్ ఇచ్చారు ఓ నెటిజన్. #JapanReview In & out full karthi show.. Really enjoyed the movie.. The character played by karthi is more interesting.. Some of the sickest action scenes I've ever scene.. Also loved the vishuals and bgm Sure shot entertainer#Japan #Karthi #Anuimmanel #Rajmurugan pic.twitter.com/Sse2Rcw1RN — Amal babu (@amalbabu1322) November 9, 2023 #Japan#JapanReview#Karthi25 An engaging commercial entertainer.. Good screenplay with some twist & turns. Superb music and Bgm by #GVP.. Top notch filmography from #Ravivarman Written & directed by #Rajmurugan pic.twitter.com/L48ZKLZpSU — Muhammed (@Muhamme60625316) November 9, 2023 #JapanReview Nice movie like it & interesting Top beautiful vishual treat with awesome bgm and one another best entertainer from #karthi Worth to watch#Japan#Rajmurukan@Karthi_Offl pic.twitter.com/8gzwoRMNLL — soosy (@SSrkgirl) November 9, 2023 #JapanReview If there karthi in a movie, entertainment is sure shot guaranteed.. He just stole the whole movie with his native mannerisms.. First half : superb 👌👌 Second half : 🥵💥 One of the best theaterical experience.. Rating 4 out of 5 ⭐️⭐️⭐️⭐️ pic.twitter.com/MSoiN51n6E — Jyothi Ps (@ps_jyothi) November 9, 2023 -
Karthi Stills: కార్తి ‘జపాన్’ మూవీ స్టిల్స్
-
దీపావళి నాకు కలిసొచ్చిన పండగ.. జపాన్ విజయం ఖాయం: కార్తీ
క్వాంటిటీ కంటే క్వాలిటీకే ప్రాముఖ్యతనిచ్చే నటుడు కార్తీ. అందుకే నటుడిగా పరిచయం అయ్యి సుమారు 18 ఏళ్లు కావస్తున్నా.. ఇప్పుటికి 25 చిత్రాలే చేశారు. అయితే ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఈయన ఇటీవల నటించిన విరుమాన్, సర్థార్, పొన్నియిన్‌సెల్వన్ పార్టు 1, 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించారు. కాగా కార్తీ తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం జపాన్. ఇది ఈయన 25వ చిత్రం కావడం విశేషం. రాజుమురుగన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మించిన ఈ భారీ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని ,రవివర్మన్ ఛాయాగ్రహణను అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి పండగ సందర్భంగా శుక్రవారం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నటుడు కార్తీ చైన్నెలో మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ జపాన్ చిత్రం తనకు చాలా స్పెషల్ అని పేర్కొన్నారు. దర్శకుడు రాజుమురుగన్ కథ,సంభాషణలు తనకు చాలా నచ్చాయన్నారు. జపాన్ చిత్రంలో కార్తీ కనిపించడని, పాత్రే కనిపిస్తుందని అన్నారు. ఇంతకు ముందు కాశ్మోరా చిత్రంలో భిన్నమైన పాత్రను పోషించినా జపాన్‌లో పూర్తిగా వైవిధ్యభరిత కథా పాత్రను చేసినట్లు చెప్పారు. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతం, రవివర్మన్ ఛాయాగ్రహణ చిత్రానికి పక్కా బలంగా ఉంటాయన్నారు. నటుడు సునీల్, విజయ్ మిల్టన్ లతో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఇక దీపావళి తనకు కలిసొచ్చిన పండగ అని, ఈ పండగ సందర్భంగా జపాన్ చిత్రం విడుదల కావడం సంతోషంగా ఉందని చెప్పారు. జపాన్ చిత్ర విజయంపై చాలా నమ్మకం ఉందనే అభిప్రాయాన్ని కార్తీ వ్యక్తం చేశారు. -
'జపాన్'లో చాలా సర్ ప్రైజ్ రోల్ చేశాను: అను ఇమ్మాన్యుయేల్.
హీరో కార్తిని పొగడ్తలతో ముంచేస్తోంది హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. అతను గొప్ప నటుడు మాత్రమే కాదని,ఆఫ్ స్క్రీన్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని అంటోంది. కార్తి, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘జపాన్’. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్.. 'దీపావళి' కానుకగా నవంబర్ 10న విడుదత కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మీడియాతో ముచ్చటిస్తూ.. హీరో కార్తి గురించి, జపాన్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ► కార్తి అద్భుతమైన నటుడు. తను టీం ప్లేయర్. ఏదైనా సన్నివేశం చేసే ముందు చర్చించుకునే వాళ్ళం. ఆయనతో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఆయన చాలా కేర్ తీసుకుంటారు. చాలా సపోర్ట్ చేస్తారు. కార్తి గారు గ్రేట్ కో స్టార్. ఆఫ్ స్క్రీన్ అందరితో చాలా చక్కగా మాట్లాడుతాడు. స్టార్లా కాకుండా సాధారణ వ్యక్తిగా ఆయన ప్రవర్తన ఉంటుంది. ► 'జపాన్'ట్రైలర్ చూస్తేనే ఇదొక యూనిక్ సినిమా అని అర్ధమైపోతుంది. కార్తి గారే కాదు ఇలాంటి పాత్రని గతంలో ఎవరూ చేయలేదు. జపాన్ దీపావళికి పర్ఫెక్ట్ ఫిల్మ్. ఇది గొప్ప థియేటర్స్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే చిత్రం. తప్పకుండా అందరూ థియేటర్స్ లోనే చూడాలి. జపాన్ చాలా క్రేజీగా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. ► ఈ చిత్రంలో నా పాత్ర ఒక సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా ఉంటుంది. దాని గురించి ఇప్పుడే ఎక్కువగా రివిల్ చేయకూడదు. ఇందులో నటిగా కనిపిస్తాను. నా పాత్ర జపాన్ జీవితంలో కీలకంగా ఉంటుంది. కార్తి, నా పాత్రకు మధ్య చాలా ఆసక్తికరమైన ట్రాక్ ఉంటుంది. తప్పకుండా అందరినీ అలరిస్తుంది. ► రాజు మురుగన్ చాలా వైవిధ్యమైన దర్శకుడు. తన ప్రతి సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. జపాన్ కథ, పాత్ర చాలా యూనిక్. ఇలాంటి కథని గతంలో వినలేదు. ఇలాంటి సినిమాని చూడడానికి ఆడియన్ గా కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ►నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవు. ప్రేక్షకులు ఇష్టపడే పాత్రలు చేయాలని ఉంటుంది. అలాంటి మంచి పాత్రలు, కథలు రావాలని కోరుకుంటాను -
నాని మరియు మృణాల్ గురించి నెటిజన్లు వెతికిన ప్రశ్నలివే చూడండి
-
యాంకర్ సుమతో నాని మరియు కార్తీ జోకులు
-
ప్రతి సినిమాలో ఒక కొత్త ధనం చూపిస్తాడు..!
-
ఖైదీ 2 త్వరలో మీ ముందుకీ..!
-
కార్తీ ‘జపాన్’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
నన్ను తమిళ అబ్బాయిలా ఉన్నావనేవారు
‘‘ఈగ’ సినిమా తమిళంలో విడుదలైన తర్వాత నేను ఎప్పుడు చెన్నై వెళ్లినా.. నన్ను తమిళ అబ్బాయిలా ఉన్నావనేవారు. అలాగే కార్తీని చూస్తే చాలామంది తెలుగు ప్రేక్షకులు తెలుగబ్బాయిలా ఉన్నాడంటారు. నాకు తెలిసి తెలుగు ప్రేక్షకులు కార్తీని సొంతం చేసుకున్నారు. వరుసగా మూడు హిట్స్ సాధించి ఇప్పుడు ‘జపాన్’తో ముందుకొస్తున్నాడు కార్తీ. దీపావళికి వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని హీరో నాని అన్నారు. కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘జపాన్’. రాజు మురుగన్ దర్శకత్వంలో ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈనెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ – ‘‘జపాన్’ లాంటి చిత్రం తీసి ప్రేక్షకుల్ని మెప్పించడం అంత సులభం కాదు. కానీ, ఈ మూవీ ట్రైలర్ చూశాక టీమ్ ఎనర్జీ, నమ్మకం నాకు కనిపించింది. అనూ ఇమ్మాన్యుయేల్ నా ‘మజ్ను’ సినిమాతో పరిచయమైంది. ‘జపాన్’ ట్రైలర్ చూసినప్పుడు చాలా మంచి సినిమాలో భాగస్వామ్యం అయినట్లు అనిపించింది. ప్రభుగారు మంచి సినిమాలు నిర్మిస్తుంటారు. లెక్కలు చూసుకుని పని చేసే నిర్మాత కాదు.. ఫ్యాషన్‌తో,ప్రాణం పట్టి పనిచేసే నిర్మాతలాగా అనిపిస్తారు. ఇలాంటి మంచి సినిమా తీసిన డైరెక్టర్ రాజు మురుగన్‌కి అభినందనలు’’ అన్నారు. ‘‘జపాన్’ నా మనసుకు బాగా దగ్గరైంది’’ అన్నారు కార్తీ. ‘‘జపాన్’ అంతా రాజు మురుగన్ శైలిలో ఉంటుంది. ఈ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహపరచదు. అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యంలో తెలుగులో ఈ సినిమా విడుదల చేస్తుండటం సంతోషంగా ఉంది’’ అని ఎస్ఆర్ ప్రభు అన్నారు. రాజు మురుగన్ మాట్లాడుతూ– ‘‘కళకు భాషతో సంబంధం లేదు. తెలుగు ప్రేక్షకులు సినిమాని పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. భారతీయ సినిమాకి ఐకానిక్‌గా గుర్తింపు పోందింది టాలీవుడ్’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాత సుప్రియ, దర్శకుడు వంశీ పైడిపల్లి, నటులు సునీల్, రాకేందు మౌళి, పాటల రచయిత భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు. -
అలాంటి కార్తీనే ఇష్టపడుతున్నారు!
‘‘చేసిన పాత్రలనే మళ్లీ చేస్తే నాకు బోరింగ్‌గా అనిపిస్తుంటుంది. ఎప్పటికప్పుడు వినూత్నంగా, ప్రయోగాత్మకంగా సినిమాలు చేసే కార్తీనే ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నారు. అంటే నేను నాలా ఉంటే ఆదరిస్తున్నారు. మరొకరిలా ఉండాలనుకోవడం లేదు. కాబట్టి నా తరహా సినిమాలే నేను చేస్తాను’’ అని కార్తీ అన్నారు. కార్తీ హీరోగా ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ‘జపాన్’ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో కార్తీ చెప్పిన విశేషాలు. ∙‘జపాన్’ క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. నిజమైన కథ కాదు. కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను రూ΄పొందించాం. ఈ సినిమా కేవలం వినోదం ఇవ్వడం మాత్రమే కాదు... మన ఉనికిని, అస్థిత్వాన్ని ప్రశ్నించేలా కూడా ఉంటుంది. ప్రస్తుత సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. సోషల్ మీడియా అంశాన్ని కూడా టచ్ చేశాం. అలాగే మనకు ‘జపాన్’ అంటే హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు దాడి గుర్తుకు రావచ్చు. ఆ దాడి తర్వాత జపాన్ దేశం మళ్లీ పుంజుకుని అత్యున్నత స్థాయికి ఎదిగింది. ఈ రిఫరెన్స్ ‘జపాన్’ పాత్రలో కూడా కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మాస్‌తో కూడిన స్ట్రాంగ్ అండ్ సెటైరికల్ రోల్ నాకు మళ్లీ ‘జపాన్’తో వచ్చినట్లు అనిపించింది. ‘జపాన్’ గ్రే క్యారెక్టర్ కాదు.. డార్క్ అంతే. నా క్యారెక్టర్లో డార్క్ హ్యూమర్ ఉంటుంది. ‘జపాన్’ కోసం రెగ్యులర్ కార్తీలా ఉండకూడదని అనుకున్నాను. దర్శకుడు కూడా ఇదే కోరుకున్నారు. ఈ సినిమా కోసం కొత్తగా మేకోవర్ అయ్యాను. నా వాయిస్ మాడ్యులేషన్, హెయిర్ స్టయిల్ అన్నీ కొత్తగా అనిపిస్తాయి. నేను నటించిన ‘ఊపిరి’ సినిమా తమిళ వెర్షన్‌కు దర్శకులు రాజు ముగరున్ డైలాగ్స్ రాశారు. ఆయనలో మంచి హ్యూమర్ ఉందని ఆ సమయంలో అనిపించింది. కానీ రాజుగారు తీసిన ‘కుకు’, ‘జోకర్’ సినిమాల్లో ఇది అంతగా లేదు. సాధారణంగా నేను నా కోసం ఏవైనా కథలు ఉన్నాయా? అని ఎవర్నీ అడగలేదు. తొలిసారి రాజు మురుగన్‌ని అడిగాను. ఓ డార్క్ ఎమోషనల్ స్టోరీ చెప్పారు. నాకు అంతగా నచ్చలేదు. ఆ తర్వాత మరో కథలోని ఓ క్యారెక్టర్ నచ్చి, ఆ పాత్ర ఆధారంగా కథ రాయమన్నాను. అలా ‘జపాన్’ కథ మొదలైంది. రాజు మురుగన్గారు గతంలో జర్నలిస్ట్‌గా చేశారు. ఆయన తన జీవితంలో చూసిన కొన్ని ఘటనలను ‘జపాన్’లో చూపించే ప్రయత్నం చేశారు. అలాగే నాగార్జునగారి అన్నపూర్ణ స్టూడియోస్‌తో అసోషియేట్ అవ్వడం ఆనందంగా ఉంది. ∙దర్శకుడు నలన్కుమార్తో నేను చేస్తున్న సినిమా 70 శాతం షూటింగ్ పూర్త యింది. ‘96’ ఫేమ్ ప్రేమ్‌కుమార్‌తో ఓ సినిమా చేయనున్నాను. అలాగే ‘ఖైదీ 2’, ‘సర్దార్ 2’ చిత్రాలు చేయాల్సి ఉంది. -
కార్తీ 'జపాన్' గుర్తుండేలా.. వాళ్లకు రూ 1.25 కోట్ల విరాళం
కార్తీక్ శివకుమార్... ముద్దుగా కార్తీ అని అభిమానులు పిలుస్తుంటారు.. తమిళనాడులో తనకు ఏ రేంజ్లో ఫ్యాన్స్ ఉన్నారో టాలీవుడ్లో కూడా అదే రేంజ్లో ఉన్నారు. వరుస హిట్ సినిమాలు చేస్తూ.. తన అభిమానులకు ట్రీట్ ఇస్తున్న కార్తీ.. గతేడాది పొన్నియన్ సెల్వన్, సర్దార్ సినిమాలతో మెప్పిస్తే.. ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్ 2 తో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దివాళి సందర్భంగా కార్తీ నటించిన 25వ సనిమా జపాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీ కెరియర్లో ఈ సినిమా ఒక బెంచ్ మార్క్ లాంటిది. కాబట్టి ఈ సినిమా తన అభిమానులకు మరింత స్పెషల్‌గా ఉండాలని ఆయన ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. (ఇదీ చదవండి: ఆరు 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు ఉన్నాయి.. నేను లోకేష్ కనగరాజ్ కాదు: సాయి రాజేష్) తన అన్నయ్య సూర్య లాగే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని కార్తీ నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా రూ. 1.25 కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అనాథాశ్రమాలు, పేద వారికి అన్నదానాలు ఏర్పాటుచేయడానికి ఈ భారీ మొత్తాన్ని వినియోగించేందుకు ఏర్పాట్లు చేశారు. జపాన్ తన కెరియర్లో 25వ సినిమా కావడంతో 25 మంది సామాజిక కార్యకర్తలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు, 25 పాఠశాలను సెలెక్ట్ చేసి ఒక్కో పాఠశాలకు రూ. లక్ష రూపాయలు. అలాగే 25 ఆస్పత్రులకు 25 లక్షలు విరాళంగా అందజేశారు. మిగిలిన మొత్తాన్ని 25 రోజుల పాటు పేదవారికి అన్నదానం చేయాలని ఆయన ఏర్పాట్లు చేశారు. వీటిలో ఇప్పటికే అన్నదానం కార్యక్రం జరుగుతుంది. కనీస అవసరాల కోసం 25 ఆస్పత్రులు,స్కూళ్లను గుర్తించి వాటికి లక్ష రూపాయల చొప్పున కార్తీ సాయం చేయనున్నారు. రాజు మురుగన్ దర్శకత్వంలో వస్తున్న జపాన్ సినిమాలో కార్తీ దొంగగా నటిస్తున్న విషయం తెలిసిందే.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 12న దివాళీ సంబర్భంగా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Karthi Sivakumar (@karthi_offl) -
ఢిల్లీ తర్వాతే రోలెక్స్.. కార్తికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన సూర్య
రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ నటించిన చిత్రం జపాన్. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అక్టోబర్ 28 చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కార్తీ, దర్శకులు రాజు మురుగన్, కెఎస్ రవికుమార్, పా.రంజిత్, లోకేష్ కనగరాజ్, సత్యరాజ్, తమన్నా తదితరులు పాల్గొన్నారు. నటుడు సూర్య ప్రత్యేక అతిథిగా విచ్చేసి జపాన్ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం వేదికపై నటుడు సూర్య మాట్లాడుతూ.. 'ఈ రోజును అందమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా తమ్ముడు కార్తీకి అన్నివిధాలా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రపంచ తమిళులందరూ కార్తీకి అందమైన ప్రయాణంతో పాటు జీవితాన్ని అందించారు. అది 20 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. కార్తి నటించిన మొదటి సినిమా పరుత్తివీరన్.. అది కమల్ పూజతో మొదలైంది. సినిమా విడుదలయ్యాక కార్తీని సరిగ్గా ఉపయోగించుకున్నారని రజనీకాంత్ గారు ప్రశంసించారు. ఒక సోదరుడిగా నేను కార్తీ కంటే ఎక్కువగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కార్తీ జీవితంలో కీలకంగా ఉన్న మణిరత్నం, జ్ఞానవేల్ రాజా, అమీర్, నిర్మాత ప్రభులకు నా ధన్యవాదాలు. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి షెడ్యూల్ ఇదే.. వేడుకలకు ఆమె దూరం) కార్తి కాలేజీ రోజుల్ని వదిలిపెట్టి 25 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ తన స్నేహితులను కలుస్తూనే ఉన్నాడు. మా తల్లిదండ్రులతో కనీసం సంవత్సరానికి 2 సార్లు విదేశాలకు వెళ్తాడు. అతను తన పిల్లలతో ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు. పని, తల్లిదండ్రులు, స్నేహితులు, సమాజాం ఇవన్నీ మనుకు కావాల్సినవి అని ఎప్పుడూ అంటుంటాడు. అందుకే మాకందరికి ఉజావన్ ఫౌండేషన్ చాలా ముఖ్యమైంది. దీంట్లో కార్తి రోల్ ఎక్కువగా ఉంటుంది. జీవితంలో నా చుట్టూ కనీసం నలుగురు ఉంటే చాలనుకున్నాను.. అయితే అభిమానుల ద్వారా ఆ కోరిక తీరింది. మా అభిమానులకు ధన్యవాదాలు. తంబి (తమ్ముడు) కొత్త సినిమా వస్తే అభిమానులు మొదటిరోజే చూస్తారు. నాకంటే తమ్ముడు అంటేనే వారికి చాలా ఇష్టం.. ఇదే మాట నాతోనే చాలమంది అభిమానులు చెప్పారు. అప్పుడు ఒక అన్నగా ఎంతో గర్వంగా ఉంటుంది అంటూనే సూర్య ఎమోషనల్ అయ్యాడు. కార్తీ తనకు నచ్చినదాన్ని మాత్రమే ఎంచుకుని దాని కోసం కష్టపడ్డాడు. ఆలోచిస్తే చాలా సినిమాల్లో నటించి ఉండేవాడు.. కానీ అతను 25 చిత్రాలలో మాత్రమే నటించాడు.. ఎన్నో ప్రాజెక్ట్‌లు కార్తి కోసం వచ్చినా రిజక్ట్ చేశాడు.. వాడికి నచ్చితేనే చేస్తాడు.. అవి మా అభిమానులను కూడా మెప్పిస్తాయి. జపాన్ అనేది మనుషులు ఎలా ఉంటారో తెలుపుతుంది. వాళ్ళు మహా మూర్ఖులు అనేదే సినిమా. అదృష్టవశాత్తూ లోకేష్ అని ఒకరు నా జీవితంలోకి పరిచయం అయ్యారు. నాపేరును అతను రోలెక్స్‌గా చేశాడు. అది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. రోలెక్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరలో మిమ్మల్ని రోలెక్స్ కలుస్తాడు. మీరు ఓపికగా ఉండటం మంచిది. కార్తీకి జపాన్ 25వ చిత్రం. సింగం నా 25వ సినిమా. ఢిల్లీ తర్వాతే రోలెక్స్ వస్తాడు.. అప్పుడు కలుద్దాం.' అంటూ కార్తికి స్వీట్ (నవ్వుతూ) వార్నింగ్ ఇచ్చాడు సూర్య. -
జపాన్ ట్రైలర్.. దొంగగా రెచ్చిపోయిన కార్తి
పొన్నియన్ సెల్వన్ తర్వాత కార్తి జపాన్ అనే సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు. కార్తి కథానాయకుడిగా రాజు మురుగన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘జపాన్’ . అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. సునీల్ కీలకపాత్రని పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వైవిధ్యభరితమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. కార్తి విభిన్నమైన లుక్‌తో కనిపించారు. ఇందుకోసం ఆయన తన లుక్ కూడా పూర్తిగా మార్చేశాడు. ఇవే విషయాలు ట్రైలర్లో తెలుస్తుంది. ఇందులో కార్తి బంగారం స్మగ్లింగ్ చేసే వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. కామెడీ జోడించి, కొత్త అవతారంలో ఆయన అలరించనున్నారు. సముద్రం ఒడ్డున నివసించే జపాన్ (కార్తీ) చిన్నప్పుడే తన తల్లి కోసం దొంగగా మారినట్టు ట్రైలర్ ఆరంభంలో ఉంది. చేపగా మొదలైన జపాన్ జర్నీ.. తిమింగలంలా ఏలా మారింది అనే కథతో ట్రైలర్ ఆరంభమవుతుంది. తన దొంగతనాలతో పోలీసులు, ప్రభుత్వంలో జపాన్ అలజడి సృష్టిస్తాడని ట్రైలర్లో ఉంది. జపాన్ను పట్టుకునేందుకు పోలీసులతో పాటు చాలా మంది ప్రయత్నిస్తారు. అయితే.. 'సొరచేపలు చుట్టుముట్టాయి. కానీ ఎన్ని ప్లాన్లు వేసినా తిమింగలం వలలో పడదుగా' అంటూ జపాన్ చెప్పే డైలాగ్ బాగా పేలింది. ఆ తర్వాత 'సింహం కాస్త సిక్ అయితే.. పందికొక్కులు వచ్చి ప్రిస్క్రిప్షన్ రాసిపెట్టాయట' అంటూ కార్తి చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తమిళనాడులోని అనేక బంగారు దుకాణాల నుంచి కొన్ని కిలోల బంగారాన్ని దొంగలించిన ఓ వ్యక్తి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జపాన్ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. జపాన్ సినిమా దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ పేర్కొంది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి షెడ్యూల్ ఇదే.. వేడుకలకు ఆమె దూరం) -
జపాన్‌తో వస్తోన్న కార్తీ.. మేకర్స్ భారీ ప్లాన్!
పరుత్తివీరన్ చిత్రంతో నటుడిగా సినీకెరీర్ ప్రారంభించిన హీరో కార్తీ. కథల ఎంపికలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇటీవల విరుమాన్, పొన్నియిన్ సెల్వన్, సర్ధార్ చిత్రాలతో వరుసగా విజయాలు అందుకున్న ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం జపాన్. ఇది ఆయన కెరీర్లో 25వ చిత్రం కావడం విశేషం. కాగా నటుడిగా కార్తీ 20 వసంతాలను పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రాన్ని రాజుమురుగన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఎస్ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మించారు. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్ నాయకిగా నటిస్తోంది. ఇందులో దర్శకుడు కేఏస్.రవికుమార్, విజయ్ మిల్టన్, వాగై చంద్రశేఖర్, టాలీవుడ్ నటుడు సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా.. జపాన్ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుకను ఈనెల 28న భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు నిర్మాతల్లో ఒకరైన ఎస్ఆర్.ప్రభు వెల్లడించారు. కార్తీ నటించిన 25వ చిత్రం కావడంతో ఈ వేడుకను ప్రత్యేకంగా అభిమానుల సమక్షంలో స్థానిక నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్తీ ఇప్పటి వరకూ నటించిన 24 చిత్రాల్లో 19 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయన్నారు. అందులో 6 చిత్రాలు తమ సంస్థలో నిర్మించడం విశేషమన్నారు. కాగా కార్తీ 25వ చిత్రం జపాన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు ఆయన్ని గౌరవించే విధంగా ఈ వేడుక ఉంటుందన్నారు. ఇందులో కార్తీ నటించిన చిత్రాలకు సంబంధించిన సన్నివేశాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఆ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ ఈ చిత్రానికి రవివర్మన్ సినిమాటోగ్రఫీ, జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
కార్తీ 'జపాన్' సినిమా కోసం నాగార్జున కీలక నిర్ణయం
కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జపాన్’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో దీపావళికి విడుదల కానుంది. కార్తీకి జపాన్ 25వ చిత్రం. తన కెరీయర్లో ఇదొక బెంచ్‌మార్క్ లాంటి మూవీ. ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుంది. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు) నాగార్జున అక్కినేని కాంపౌండ్ నుంచి ఈ సినిమా తెలుగులో విడుదల కానున్నడంతో మార్కెట్‌కు ఎలాంటి సందేహం అక్కర్లేదని చెప్పవచ్చు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి 200 కోట్ల దోపిడీకి పాల్పడే కథాంశంతో ఉంటుందని టీజర్‌తో ఒక క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా ఇండియా అంతటా జపాన్‌పై (కార్తీ పాత్ర పేరు) 182 కేసులున్నాయని, అతనొక గజదొంగ అంటూ పాత్రను రివీల్ చేశారు. తమిళనాడులోని ఒక దొంగ జీవితాన్ని బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగార్జున- కార్తీ ఇద్దరూ కలిసి ఊపిరి సినిమాలో మెప్పించారు. ఆ సినిమా నుంచే వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. జపాన్ సినిమాను అన్నపూర్ణ సంస్థ విడుదల చేయనున్నడంతో కార్తీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. సినిమా విడుదల తప్పకుండా భారీ ఎత్తున ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.