మరో వారం వచ్చేసింది. మరో 10 రోజుల్లో 'సలార్' మూవీ థియేటర్లలోకి రాబోతుంది. దీంతో ఈ వీక్.. చెప్పుకోదగ్గ మూవీస్ ఏం థియేటర్లలో రిలీజ్ కావట్లేదు. దీంతో ఆటోమేటిక్‌గా మూవీ లవర్స్ దృష్టి ఓటీటీలపై పడుతుంది. సరిగ్గా దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఓటీటీ సంస్థ రెడీ అయిపోయాయి. అలా ఈ వారం ఏకంగా 32 మూవీస్.. ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో పలు తెలుగు చిత్రాలు కూడా ఉండటం విశేషం.
(ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?)
ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. కార్తీ 'జపాన్', సల్మాన్ 'టైగర్ 3' చిత్రాలు మాత్రమే అందరికీ ఆసక్తి కలిగిస్తున్నాయి. మిగతావన్నీ కూడా ఇంగ్లీష్, హిందీ సిరీసులు-సినిమాలే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇందులో స్ట్రెయిట్ మూవీస్ ఏం లేనప్పటికీ వీకెండ్ వచ్చేసరికి కొత్తగా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీస్ రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.
ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ లిస్ట్ (డిసెంబరు 10 నుంచి 17 వరకు)
అమెజాన్ ప్రైమ్
- టైగర్ 3 (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 12
- డెత్స్ గేమ్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 15
- రీచర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 15
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
- ఫలిమి (మలయాళ మూవీ) - డిసెంబరు 15
- ద ఫ్రీలాన్సర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - డిసెంబరు 15
నెట్‌ఫ్లిక్స్
- జపాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 11
- కెవిన్ హర్ట్ & క్రిస్ రాక్: హెడ్ లైనర్స్ ఓన్లీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 12
- సింగిల్ ఇన్‌ఫెర్నో సీజన్ 3 (కొరియన్ సిరీస్) - డిసెంబరు 12
- అండర్ ప్రెజర్: ద యూఎస్ ఉమెన్స్ వరల్డ్‌కప్ టీమ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 12
- 1670 (పోలిష్ సిరీస్) - డిసెంబరు 13
- కార్ మాస్టర్స్ రష్ టూ రిచెస్: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 13
- ఇఫ్ ఐ వర్ లూయిస్ సోంజా (పోర్చుగీస్ సిరీస్) - డిసెంబరు 13
- యాస్ ద క్రో ఫ్లైస్: సీజన్ 2 (టర్కిష్ సిరీస్) - డిసెంబరు 14
- ద క్రోన్ సీజన్ 6: పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 14
- యూ యూ హకూషో (జపనీస్ సిరీస్) - డిసెంబరు 14
- క్యారోల్ & ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 15
- చికెన్ రన్: డాన్ ఆఫ్ ద నగ్గెట్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 15
- ఫేస్ టూ ఫేస్ విత్ ఈటీఏ: కన్వర్జేషన్స్ విత్ ఏ టెర్రరిస్ట్ (స్పానిష్ సినిమా) - డిసెంబరు 15
- ఫమిలియా (స్పానిష్ మూవీ) - డిసెంబరు 15
- ఐ లవ్ లిజీ (తగలాగ్ చిత్రం) - డిసెంబరు 15
- శేషన్ మైక్-ఇల్ ఫాతిమా (మలయాళ మూవీ) - డిసెంబరు 15
- యో! క్రిస్మస్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 15
- ద రోప్ కర్స్ 3 (మాండరిన్ మూవీ) - డిసెంబరు 17
- వివాంట్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 17
జియో సినిమా
- ద బ్లాకెనింగ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 16
- ద సోవనీర్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 17
లయన్స్ గేట్ ప్లే
- డిటెక్టివ్ నైట్: ఇండిపెండెన్స్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 15
ఆపిల్ ప్లస్ టీవీ
- ద ఫ్యామిలీ ప్లాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 15
జీ 5
- కూసే మునిస్వామి వీరప్పన్ (తమిళ సిరీస్) - డిసెంబరు 14
బుక్ మై షో
- ద పర్షియన్ వెర్షన్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 12
- టేలర్ స్విఫ్ట్-ద ఈరస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 13
- లైలాస్ బ్రదర్స్ (పర్షియన్ చిత్రం) - డిసెంబరు 15
- వింటర్ టైడ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 15
(ఇదీ చదవండి: లేటు వయసులో పెళ్లి చేసుకున్న జైలర్ నటుడు, ఫోటోలు వైరల్)
Comments
Please login to add a commentAdd a comment