కార్తీలో జపాన్‌ తెచ్చిన మార్పు | Actor Karthi 26th Project Details | Sakshi
Sakshi News home page

కార్తీలో జపాన్‌ తెచ్చిన మార్పు

Mar 10 2024 10:37 AM | Updated on Mar 10 2024 11:06 AM

Actor Karthi 26th Project Details - Sakshi

జపాన్‌ అనే ఒక్క చిత్రం ద్వారా నటుడు కార్తీలో చాలా మార్పు తెచ్చిందనిపిస్తోంది. ఆయన చాలా నమ్మకం పెట్టుకున్న 25వ చిత్రం జపాన్‌. అయితే అందరి అంచనాలను తారు మారు చేసి చిత్రం నిరాశ పరచింది. ఇక ఇంతకు ముందెప్పూడూ లేని విధంగా కార్తీ చేతిలో 7 చిత్రాలు ఉన్నాయంటే సాధారణ విషయం కాదు. కాగా కార్తీ నటిస్తున్న 26వ చిత్రాన్ని నలన్‌ కుమారసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు సూదు కవ్వుమ్‌, కాదలుమ్‌ కడందు పోగుమ్‌ వంటి విజయవంతమైన చిత్రాలను తెర కెక్కించారు.

కాగా కార్తీ 26వ చిత్రాన్ని స్డూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్న చిత్రం కావడంతో దీనిపై నానాటికీ భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. కాగా శరవేగంగా నిర్మాణ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పుటికి 50 శాతం పూర్తి అయ్యిందని యూనిట్‌ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో పాటు చిత్ర ప్రారంభోత్సవ దృశాలతో కూడిన వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కథా, కథనాలను సరికొత్త బాణీలో తెరపై ఆవిష్కరించే దర్శకుడు నలన్‌ కుమారసామి. ఈ చిత్రాన్ని తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారని యూనిట్‌ వర్గాలు చెప్పారు. కాగా ఈ చిత్రంలో నటించే ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement