‘‘చేసిన పాత్రలనే మళ్లీ చేస్తే నాకు బోరింగ్‌గా అనిపిస్తుంటుంది. ఎప్పటికప్పుడు వినూత్నంగా, ప్రయోగాత్మకంగా సినిమాలు చేసే కార్తీనే ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నారు. అంటే నేను నాలా ఉంటే ఆదరిస్తున్నారు. మరొకరిలా ఉండాలనుకోవడం లేదు. కాబట్టి నా తరహా సినిమాలే నేను చేస్తాను’’ అని కార్తీ అన్నారు.
కార్తీ హీరోగా ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో ఎస్‌ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించిన ‘జపాన్’ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో కార్తీ చెప్పిన విశేషాలు.
∙‘జపాన్’ క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. నిజమైన కథ కాదు. కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను రూ΄పొందించాం. ఈ సినిమా కేవలం వినోదం ఇవ్వడం మాత్రమే కాదు... మన ఉనికిని, అస్థిత్వాన్ని ప్రశ్నించేలా కూడా ఉంటుంది. ప్రస్తుత సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. సోషల్ మీడియా అంశాన్ని కూడా టచ్ చేశాం. అలాగే మనకు ‘జపాన్’ అంటే హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు దాడి గుర్తుకు రావచ్చు. ఆ దాడి తర్వాత జపాన్ దేశం మళ్లీ పుంజుకుని అత్యున్నత స్థాయికి ఎదిగింది. ఈ రిఫరెన్స్ ‘జపాన్’ పాత్రలో కూడా కనిపిస్తుంది.
చాలా కాలం తర్వాత మాస్‌తో కూడిన స్ట్రాంగ్ అండ్ సెటైరికల్ రోల్ నాకు మళ్లీ ‘జపాన్’తో వచ్చినట్లు అనిపించింది. ‘జపాన్’ గ్రే క్యారెక్టర్ కాదు.. డార్క్ అంతే. నా క్యారెక్టర్‌లో డార్క్ హ్యూమర్ ఉంటుంది. ‘జపాన్’ కోసం రెగ్యులర్ కార్తీలా ఉండకూడదని అనుకున్నాను. దర్శకుడు కూడా ఇదే కోరుకున్నారు. ఈ సినిమా కోసం కొత్తగా మేకోవర్ అయ్యాను. నా వాయిస్ మాడ్యులేషన్, హెయిర్ స్టయిల్ అన్నీ కొత్తగా అనిపిస్తాయి.
నేను నటించిన ‘ఊపిరి’ సినిమా తమిళ వెర్షన్‌కు దర్శకులు రాజు ముగరున్ డైలాగ్స్ రాశారు. ఆయనలో మంచి హ్యూమర్ ఉందని ఆ సమయంలో అనిపించింది. కానీ రాజుగారు తీసిన ‘కుకు’, ‘జోకర్’ సినిమాల్లో ఇది అంతగా లేదు. సాధారణంగా నేను నా కోసం ఏవైనా కథలు ఉన్నాయా? అని ఎవర్నీ అడగలేదు. తొలిసారి రాజు మురుగన్‌ని అడిగాను. ఓ డార్క్ ఎమోషనల్ స్టోరీ చెప్పారు. నాకు అంతగా నచ్చలేదు. ఆ తర్వాత మరో కథలోని ఓ క్యారెక్టర్ నచ్చి, ఆ పాత్ర ఆధారంగా కథ రాయమన్నాను. అలా ‘జపాన్’ కథ మొదలైంది.
రాజు మురుగన్‌గారు గతంలో జర్నలిస్ట్‌గా చేశారు. ఆయన తన జీవితంలో చూసిన కొన్ని ఘటనలను ‘జపాన్’లో చూపించే ప్రయత్నం చేశారు. అలాగే నాగార్జునగారి అన్నపూర్ణ స్టూడియోస్‌తో అసోషియేట్ అవ్వడం ఆనందంగా ఉంది. ∙దర్శకుడు నలన్‌కుమార్‌తో నేను చేస్తున్న సినిమా 70 శాతం షూటింగ్ పూర్త యింది. ‘96’ ఫేమ్ ప్రేమ్‌కుమార్‌తో ఓ సినిమా చేయనున్నాను. అలాగే ‘ఖైదీ 2’, ‘సర్దార్ 2’ చిత్రాలు చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment