![Suriya Comments On Karthi - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/29/suriya-karthi.jpeg.webp?itok=24A9Qgr6)
రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ నటించిన చిత్రం జపాన్. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఎస్‌ఆర్ ప్రభు నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అక్టోబర్ 28 చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కార్తీ, దర్శకులు రాజు మురుగన్, కెఎస్ రవికుమార్, పా.రంజిత్, లోకేష్ కనగరాజ్, సత్యరాజ్, తమన్నా తదితరులు పాల్గొన్నారు. నటుడు సూర్య ప్రత్యేక అతిథిగా విచ్చేసి జపాన్ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.
అనంతరం వేదికపై నటుడు సూర్య మాట్లాడుతూ.. 'ఈ రోజును అందమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా తమ్ముడు కార్తీకి అన్నివిధాలా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రపంచ తమిళులందరూ కార్తీకి అందమైన ప్రయాణంతో పాటు జీవితాన్ని అందించారు. అది 20 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. కార్తి నటించిన మొదటి సినిమా పరుత్తివీరన్.. అది కమల్ పూజతో మొదలైంది. సినిమా విడుదలయ్యాక కార్తీని సరిగ్గా ఉపయోగించుకున్నారని రజనీకాంత్ గారు ప్రశంసించారు. ఒక సోదరుడిగా నేను కార్తీ కంటే ఎక్కువగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కార్తీ జీవితంలో కీలకంగా ఉన్న మణిరత్నం, జ్ఞానవేల్ రాజా, అమీర్, నిర్మాత ప్రభులకు నా ధన్యవాదాలు.
(ఇదీ చదవండి: వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి షెడ్యూల్ ఇదే.. వేడుకలకు ఆమె దూరం)
కార్తి కాలేజీ రోజుల్ని వదిలిపెట్టి 25 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ తన స్నేహితులను కలుస్తూనే ఉన్నాడు. మా తల్లిదండ్రులతో కనీసం సంవత్సరానికి 2 సార్లు విదేశాలకు వెళ్తాడు. అతను తన పిల్లలతో ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు. పని, తల్లిదండ్రులు, స్నేహితులు, సమాజాం ఇవన్నీ మనుకు కావాల్సినవి అని ఎప్పుడూ అంటుంటాడు. అందుకే మాకందరికి ఉజావన్ ఫౌండేషన్ చాలా ముఖ్యమైంది. దీంట్లో కార్తి రోల్ ఎక్కువగా ఉంటుంది.
జీవితంలో నా చుట్టూ కనీసం నలుగురు ఉంటే చాలనుకున్నాను.. అయితే అభిమానుల ద్వారా ఆ కోరిక తీరింది. మా అభిమానులకు ధన్యవాదాలు. తంబి (తమ్ముడు) కొత్త సినిమా వస్తే అభిమానులు మొదటిరోజే చూస్తారు. నాకంటే తమ్ముడు అంటేనే వారికి చాలా ఇష్టం.. ఇదే మాట నాతోనే చాలమంది అభిమానులు చెప్పారు. అప్పుడు ఒక అన్నగా ఎంతో గర్వంగా ఉంటుంది అంటూనే సూర్య ఎమోషనల్ అయ్యాడు. కార్తీ తనకు నచ్చినదాన్ని మాత్రమే ఎంచుకుని దాని కోసం కష్టపడ్డాడు.
ఆలోచిస్తే చాలా సినిమాల్లో నటించి ఉండేవాడు.. కానీ అతను 25 చిత్రాలలో మాత్రమే నటించాడు.. ఎన్నో ప్రాజెక్ట్‌లు కార్తి కోసం వచ్చినా రిజక్ట్ చేశాడు.. వాడికి నచ్చితేనే చేస్తాడు.. అవి మా అభిమానులను కూడా మెప్పిస్తాయి. జపాన్ అనేది మనుషులు ఎలా ఉంటారో తెలుపుతుంది. వాళ్ళు మహా మూర్ఖులు అనేదే సినిమా.
అదృష్టవశాత్తూ లోకేష్ అని ఒకరు నా జీవితంలోకి పరిచయం అయ్యారు. నాపేరును అతను రోలెక్స్‌గా చేశాడు. అది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. రోలెక్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరలో మిమ్మల్ని రోలెక్స్ కలుస్తాడు. మీరు ఓపికగా ఉండటం మంచిది. కార్తీకి జపాన్ 25వ చిత్రం. సింగం నా 25వ సినిమా. ఢిల్లీ తర్వాతే రోలెక్స్ వస్తాడు.. అప్పుడు కలుద్దాం.' అంటూ కార్తికి స్వీట్ (నవ్వుతూ) వార్నింగ్ ఇచ్చాడు సూర్య.
Comments
Please login to add a commentAdd a comment