తమిళసినిమా: వరుస విజయాలతో రైజింగ్‌లో ఉన్న నటుడు కార్తీ. కథల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నఆయన సర్ధార్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం జపాన్. కుక్కూ, జోకర్ వంటి వైవిధ్యంతో కూడిన విజయవంతమైన చిత్రాల దర్శకుడు రాజుమురుగన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జపాన్. నటి అను ఇమ్మాన్యుయేల్ నాయకిగా నటిస్తోంది. ఈ బ్యూటీ ఇంతకుముందు తమిళంలో విశాల్ కథానాయకుడిగా నటించిన తుప్పరివాలన్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత శివకార్తికేయన్‌కు జంటగా నమ్మ వీటి పిళ్లై చిత్రంలో నటింంది. జపాన్ చిత్రం ఈమెకు ఇక్కడ మూడోది అవుతుంది.
కాగా ఇందులో తెలుగు నటుడు సునీల్, చాయాగ్రాహకుడు, దర్శకుడు విజయ్ మిల్టన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి రవివర్మన్ చాయాగ్రహణం, జీవీ ప్రకాష్ కువర్ సంగీతాన్ని అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్‌ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. నటుడు కార్తీ నటిస్తున్న 25వ చిత్రం ఇది. చిత్ర తొలి షెడ్యూల్ తూత్తుక్కుడి జిల్లా పరిసర ప్రాంతాల్లో నిర్వహింగ్రాహకుడు, దర్శకుడు విజయ్ మిల్టన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి రవివర్మన్ చాయాగ్రహణం, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్‌ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. నటుడు కార్తీ నటిస్తున్న 25వ చిత్రం ఇది. చిత్ర తొలి షెడ్యూల్ తూత్తుక్కుడి జిల్లా పరిసర ప్రాంతాల్లో నిర్వహించి పూర్తిచేసినట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. కాగా రెండవ షెడ్యూల్ చిత్రీకరణ కోసం బుధవారం చిత్ర యూనిట్ కేరళకు వెళ్లినట్లు సమాచారం. కాగా ఇటీవల జపాన్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చిందని నిర్మాతలు పేర్కొన్నారు. కాగా కార్తీ, దర్శకుడు రాజుమురుగన్‌ల కాంబినేషన్లో రూపొందుతున్న జపాన్ చిత్రంపై కోలీవుడ్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment