ఆసక్తిగా ఊర్వశివో రాక్షసివో ట్రైలర్‌, వెన్నెల కిషోర్‌ కామెడీ మామూలుగా లేదుగా | Allu Sirish, Anu Emmanuel Urvasivo Rakshasivo Trailer Out | Sakshi
Sakshi News home page

Urvasivo Rakshasivo Trailer Launch: ఆసక్తిగా ఊర్వశివో రాక్షసివో ట్రైలర్‌, వెన్నెల కిషోర్‌ కామెడీ మామూలుగా లేదుగా

Published Mon, Oct 31 2022 1:26 PM | Last Updated on Mon, Oct 31 2022 1:34 PM

Allu Sirish, Anu Emmanuel Urvasivo Rakshasivo Trailer Out - Sakshi

అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్‌ జంటగా  నటించిన చిత్రం "ఊర్వశివో రాక్షసివో". రాకేశ్‌ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్‌, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రం బృందం. లవ్, రొమాన్స్‌, కామెడీ సన్నివేశాలతో ఈ ట్రైలర్‌ శాంతం ఆకట్టుకుంటుంది. ఇందులో​ ముఖ్యంగా అను ఇమ్మానుయేల్‌, శిరీష్‌ల  లవ్‌ ట్రాక్‌, వెన్నెల కిషోర్‌ కామెడీ పంచ్‌లు ఆద్యాంతం ఆకట్టుకుంటున్నాయి.

చదవండి: సిద్దార్థ్‌, అదితిల సీక్రెట్‌ డేటింగ్‌? వైరల్‌గా హీరో పోస్ట్‌

‘‘తను కొరియన్‌ వెబ్‌సిరీస్‌లా ట్రెండీగా ఉంటే నువ్వెంట్రా ‘కార్తికదీపం’ సీరియల్‌లో డాక్టర్‌బాబు, వంటలక్కలా పేజీలు పేజీలు డైలాగ్స్‌ చెబుతున్నావ్‌’’, ‘ఇన్ని ఈ.ఎమ్‌.ఐలు ఉన్నావాడు ఏ అమ్మాయి గురించి ఆలోచించకూడదురా. అది బేసిక్‌’ అంటూ వెన్నెల కిషోర్‌ కామెడీ డైలాగ్స్‌ ఆసక్తిగా ఉన్నాయి. చూస్తుంటే ఈ సినిమా రొమాంటిక్‌, లవ్‌, కామెడీ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌ అందించేలా కనిపిస్తోంది.  గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో ఈ సినిమా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement