ఓ రిచ్ కుర్రాడు ట్రిప్ కోసం అమెరికా నుంచి ఇండియా రీచ్ అయ్యాడు. బ్యాక్ టు అమెరికా కాకుండా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందట. అయితే ఆ అబ్బాయి రిచ్ అయినప్పటికీ సడన్‌గా మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేయాల్సి వచ్చింది. ఎందుకలా అంటే.. ఆల్రెడీ దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన మలయాళ చిత్రం ‘ఏబీసీడీ: అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ’ సినిమా చూసిన వారికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. అల్లు శిరీష్ హీరోగా నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి తెరకెక్కించనున్నారు.
‘మధుర’ శ్రీధర్ నిర్మించనున్నారు. ‘‘ఏబీసిడీ సినిమాలో కథనం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. యూఎస్ నుంచి ట్రిప్ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరం’’ అని పేర్కొన్నారు అల్లు శిరీష్. ఈ నెల 28న ఈ చిత్రం ప్రారంభమవుతుందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే.. గతేడాది మేజర్ రవి దర్శకత్వంలో మోహన్‌లాల్ ప్రధాన పాత్ర చేసిన మలయాళ చిత్రం ‘1971: బియాండ్ ది బోర్డర్స్’లో అల్లు శిరీష్ కీలక పాత్ర చేశారు. ఇప్పుడు మలయాళ చిత్రం ‘ఏబీసీడీ’ రీమేక్‌లో నటించనుండటం విశేషం.
కన్‌ఫ్యూజన్ కుర్రోడు
Published Wed, Apr 25 2018 12:25 AM | Last Updated on Wed, Apr 25 2018 12:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment