ABCDE
-
మత్తులో మనోళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాదకద్రవ్యాల వినియోగంలో ఉన్న చీకటి కోణాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో డ్రగ్స్ వినియోగంపై సర్వేల వివరాలు వెలువడుతున్నాయి. టాప్–10 నగరాల్లో ఢిల్లీ, ముంబై.. జర్మనీకి చెందిన మార్కెట్ పరిశోధన సంస్థ ఏబీసీడీ ప్రపంచంలోని 120 దేశాల్లో 2018 డ్రగ్స్ వినియోగంపై డేటా ఆధారంగా జాబితాను రూపొందించింది. ఏబీసీడీ జాబితా ప్రకారం.. ► ప్రపంచంలో అత్యధికంగా డ్రగ్స్ వినియోగం న్యూయార్క్ నగరంలో జరుగుతోంది. ఇక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం 70 వేల 252 కిలోల మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. ► పాకిస్తాన్‌లోని కరాచీ నగరం రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏటా 38 వేల 56 కిలోల డ్రగ్స్‌ను వినియోగిస్తారు. ► ప్రపంచంలోని టాప్–10 నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో, దేశ ఆర్థి క రాజధాని ముంబై ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీవాసులు ప్రతీ సంవత్సరం 34 వేల 708 కిలోల డ్రగ్స్ వినియోగించగా, ముంబై వాసులు ప్రతీ ఏటా 29 వేల 374 కిలోల మాదక ద్రవ్యాలను వాడుతున్నారు. ► నాలుగోస్థానంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ( 32,713 కిలోలు), ఐదోస్థానంలో ఈజిప్ట్‌లోని కైరో ( 29,565 కిలోలు), ఏడో స్థానంలో ఇంగ్లండ్ రాజధాని లండన్ (28,485 కిలోలు), ఎనిమిదోస్థానంలో అమెరికాలోని షికాగో (22,262 కిలోలు), తొమ్మిదోస్థానంలో రష్యా రాజధాని మాస్కో ( 20,747 కిలోలు), పదో స్థానంలో కెనడా రాజధాని టొరంటొ ( 20,638 కిలోలు) ఉన్నాయి. 5 ఏళ్లలో 14.74 లక్షల కిలోల డ్రగ్స్.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2019లో 3.42 లక్షల కిలోల కంటే ఎక్కువ మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. 35,310 మందిని ఎన్సీబీ అరెస్టు చేసింది. అరెస్ట్ అయిన వారిలో 35 వేల మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో 2015 – 2019 మధ్య దేశవ్యాప్తంగా ఎన్సీబీ 14.74 లక్షల కిలోల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకుంది. 2018 లో అత్యధికంగా 3.91 లక్షల కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. రోజుకు 23 మంది మృతి.. ఒకసారి మాదకద్రవ్యాలకు బానిసౖలైన వారు ఆ వ్యసనాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. డ్రగ్స్ వినియోగంతోనూ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. డ్రగ్స్ దొరకని పరిస్థితుల్లోనూ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దేశంలో మాదకద్రవ్యాల వినియోగం కారణంగా ప్రతిరోజూ 23 మంది మరణిస్తున్నారని ఎన్సీబీ గణాంకాలు సూచిస్తున్నాయి. గతేడాది 7,860 మంది డ్రగ్స్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. డ్రగ్స్ అధిక మోతాదు కారణంగా 704 మంది మరణించారు. 2019లో డ్రగ్స్ కారణంగా 8,564 మంది మృతి చెందారు. దీని ప్రకారం ప్రతిరోజూ 23 మంది మాదకద్రవ్యాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. -
బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి...
అల్లు శిరీష్ హీరోగా డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి’ ట్యాగ్‌లైన్. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాను ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించారు. మే 17న చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ ని కరెక్ట్‌గా చేయాలి. ప్రేక్షకులందరికీ నచ్చేలా తీయాలని మేం సినిమా ఆరంభించే ముందు అనుకున్నాం. అది నెరవేరింది. శిరీష్ ఫెంటాస్టిక్‌గా నటించాడు. శిరీష్‌లో హ్యాపీనెస్ చూడాలనుకున్నాను. అది కూడా ఈ రోజు నెరవేరింది. హీరో, హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ, భరత్, వెన్నెల కిశోర్‌ల కామెడీ హైలైట్ అయ్యాయని అంటున్నారు. శిరీష్ నటించిన బెస్ట్ మూవీ ‘శ్రీరస్తు– శుభమస్తు’ని మించి మా సినిమా వసూళ్లు ఉండాలన్నది మా ఆశ. వీకెండ్‌కే ఆ ఫీట్‌ని సాధిస్తాం’’ అన్నారు. సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మేమందరం సినిమాలో ఎక్కడెక్కడ మంచి స్పందన వస్తుందని అనుకున్నామో, అక్కడే ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పా¯Œ ్స రావటం ఆనందంగా ఉంది. శిరీష్‌గారి యాక్టింగ్‌కి మంచి పేరు వచ్చింది’’ అన్నారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ రోల్ చేస్తున్నప్పుడు పర్సనల్‌గా బాగా కనెక్ట్ అయ్యాను. ఆర్టిస్ట్‌గా ఎదిగిన ఫీలింగ్ ఉంది. ఈ సినిమాకు వచ్చినంత రెస్పాన్స్ గతంలో నేను చేసిన ఏ సినిమాకూ రాలేదు. నాకు ఇంత పేరు వచ్చిందంటే ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ సంజీవ్దే’’ అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ధీరజ్ పాల్గొన్నారు. -
కన్ఫ్యూజన్ కుర్రోడు
ఓ రిచ్ కుర్రాడు ట్రిప్ కోసం అమెరికా నుంచి ఇండియా రీచ్ అయ్యాడు. బ్యాక్ టు అమెరికా కాకుండా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందట. అయితే ఆ అబ్బాయి రిచ్ అయినప్పటికీ సడన్‌గా మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేయాల్సి వచ్చింది. ఎందుకలా అంటే.. ఆల్రెడీ దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన మలయాళ చిత్రం ‘ఏబీసీడీ: అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ సినిమా చూసిన వారికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. అల్లు శిరీష్ హీరోగా నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి తెరకెక్కించనున్నారు. ‘మధుర’ శ్రీధర్ నిర్మించనున్నారు. ‘‘ఏబీసిడీ సినిమాలో కథనం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. యూఎస్ నుంచి ట్రిప్ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరం’’ అని పేర్కొన్నారు అల్లు శిరీష్. ఈ నెల 28న ఈ చిత్రం ప్రారంభమవుతుందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే.. గతేడాది మేజర్ రవి దర్శకత్వంలో మోహన్‌లాల్ ప్రధాన పాత్ర చేసిన మలయాళ చిత్రం ‘1971: బియాండ్ ది బోర్డర్స్’లో అల్లు శిరీష్ కీలక పాత్ర చేశారు. ఇప్పుడు మలయాళ చిత్రం ‘ఏబీసీడీ’ రీమేక్‌లో నటించనుండటం విశేషం. -
బీసీ డిక్లరేషన్
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : సామాజిక, రాజకీయ, ఆత్మగౌరవ పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచిన పోరుఖిల్లా... తాజాగా బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తేందుకు సన్నద్ధమవుతోంది. వెనుకబడిన వర్గాలకు సమానత్వం, సాధికారతే లక్ష్యంగా డిక్లరేషన్ చేసేందుకు ఓరుగల్లు కేంద్రంగా నిలవనుంది. మహాత్మా జ్యోతిరావు పూలే అకాడమీ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ (ఏబీసీడీఈ) వరంగల్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి సమావేశానికి ఆతిథ్యమిచ్చేందుకు ముస్తాబవుతోంది. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో శని, ఆదివారాల్లో జరిగే సమావేశంలో మెజార్టీ జనాభా ఉన్న బీసీలు ఆరున్నర దశాబ్దాలుగా ఎలా మోసపోతున్నారు... అభివృద్ధి ఫలాల్లో వాటా... రాజ్యాధికారంలో భాగం... వృత్తుల విధ్వంసం, ఉత్పత్తి కులాలు, సేవా కులాలు, సంచార కులాలకు చెందిన వారు విద్యకు, ఉపాధికి దూరమవుతున్న తీరు... వంటి అంశాలపై మేధావులు, ప్రముఖులు చర్చించనున్నారు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో బీసీలు తమ హక్కులు, సమానత్వ సాధనకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. అంతేకాకుండా పలు అంశాలపై సదస్సులు, చర్చాగోష్టులు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు రూపకల్పన చేశారు. ఈ మేరకు వివిధ యూనివర్సిటీలు, న్యాయవ్యవస్థ, అధికార రంగంలో ఉన్న మేధావులు, బీసీ సంఘాల నాయకులు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నట్లు ఏబీసీడీఈ అధ్యక్షుడు, ప్రొఫెసర్ మురళీమనోహర్ తెలిపారు. బీసీ కమిషన్ జాతీయ చైర్మన్ ఎంఎన్ రావు సమావేశాన్ని ప్రారంభించనున్నారని, వివిధ రాజకీయ పక్షాలకు చెందిన బీసీ నేతలు మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ఎంపీలు, ఎమ్మెల్యేలు పొన్నం, మధుయాష్కీ, రాపోలు ఆనందభాస్కర్, దేవేందర్‌గౌడ్, సుధారాణి, కేశవరావు, ఈటెల రాజేందర్, వినయ్, దత్తాత్రేయ, యెండల లక్ష్మీనారాయణ, డాక్టర్ లక్ష్మణ్‌తో పాటు బీసీ సామాజిక సంఘాల నేతలు ఉ.సాంబశివరాం, వై. కోటేశ్వర్రావు తదితరులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. వివిధ రంగాలోన్లి పరిశోధకులకు సైతం ఆహ్వానం పలికినట్లు వెల్లడించారు. సమావేశ ఏర్పాట్లను ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు శుక్రవారం పరిశీలించారు. బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం బీసీలకు అన్ని రంగాల్లో జరిగిన అన్యాయంపై ఈ సమావేశంలో చర్చిస్తాం. ఇప్పటివరకు అధికారం, వనరులు, పెట్టుబడి, ఉత్పత్తి, చివరకు పంపిణీ కూడా ఒక వర్గానికే జరిగింది. అగ్రకులాల వారికి అనుకూలంగా విధానాలు మార్చుకున్నారు. 50 శాతంగా ఉన్న బీసీ జనాభాకు జరుగుతున్న అన్యాయంపై చర్చిస్తాం. విద్య, ఉద్యోగ, ఆరోగ్యం, వైద్యం, సేవా రంగాలు, వలసలు.. ఇలా అన్ని అంశాలపై ప్రణాళికలకు రూపకల్పన చేస్తాం. బీసీలకు పోరాట కార్యక్రమాన్ని అందజేసేందుకు ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నా. - ప్రొఫెసర్ మురళీమనోహర్, ఏబీసీడీఈ అధ్యక్షుడు