
తాజాగా అతడు సోషల్ మీడియాలో మరోసారి ఎమోషనల్ అయ్యాడు. తెలుగులో నాని నటించిన జెర్సీ మూవీ..
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న మూవీ 'ప్రేమ కాదంటా?'. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌తో, ఫస్ట్ లుక్ తెగ హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఆ మధ్య నవంబర్ 11వ తేదీ నాకు చాలా ప్రత్యేకం అంటూ ట్వీట్ చేయడంతో ఏంటి, శిరీష్ ప్రేమలో పడ్డాడా? అని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. దీనిపై అతడు స్పందిస్తూ తన కొత్త సినిమా ఫిక్స్ అయిందని పుకార్లకు చెక్ పెట్టాడు.
తాజాగా అతడు సోషల్ మీడియాలో మరోసారి ఎమోషనల్ అయ్యాడు. తెలుగులో నాని నటించిన 'జెర్సీ' మూవీ హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ హోర్డింగ్‌లో అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్ అని రాసి ఉండటాన్ని చూసి ఉద్వేగానికి లోనయ్యాడు. అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్ అని జుహు సర్కిల్‌లో ఓ హోర్డింగ్‌లో చూడాలని పద్నాలుగేళ్లుగా ఎదురుచూశాను. మొత్తానికి జరిగింది అని రాసుకొచ్చాడు. కాగా జెర్సీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 31న విడుదలవుతోంది.
Waited 14 years to see a billboard of an Allu Entertainment film at the Juhu circle. Finally it's happening. pic.twitter.com/JoOT45hhT1
— Allu Sirish (@AlluSirish) December 24, 2021