అల్లు హీరో సినిమాకు లైన్ క్లియర్ | Producer Anil sunkar about Okka kshanam controversy | Sakshi
Sakshi News home page

Dec 20 2017 12:09 PM | Updated on Dec 20 2017 12:09 PM

Producer Anil sunkar about Okka kshanam controversy - Sakshi

శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న అల్లు వారబ్బాయి శిరీష్, త్వరలో ఒక్క క్షణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం విఐ ఆనంద్ దర్శకత‍్వంలో చక్రి నిర్మిస్తున్న ఈసినిమాపై కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొరియన్ సినిమా ప్యారలల్ లైఫ్ ఇన్సిపిరేషన్ తో ఈ సినిమా రూపొందిందన్న ప్రచారం జరిగింది.

అయితే అదే సమయంలో ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ప్యారలల్ లైఫ్ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా ‘2 మేమిద్దరం’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు తేడాతో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. దీంతో ఈ రెండు చిత్రయూనిట్ ల మధ్య వివాదం నడుస్తోందన్న ప్రచారం జరుగింది. అయితే ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ తమ మధ్య ఎలాంటి ఇష్యూ లేదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత అనిల్ సుంకర.

తాజాగా ఈ వివాదంపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘ఒక్క క్షణం టీం విఐ ఆనంద్, చక్రి లతో మాట్లాడాను. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఒక్క క్షణం కథా కథనాలు విన్న తరువాత ఆ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనిపిస్తోంది. హీరో అల్లు శిరీష్, దర్శకుడు విఐ ఆనంద్, నిర్మాత చక్రిలకు నా శుభాకాంక్షలు’. అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement