
హీరో అల్లు శిరీష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమాల గురించే కాకుండా.. ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను కూడా ఆయన ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇంట్లో జెంగా ఆడుతున్న ఓ చిన్న వీడియోను శిరీష్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే ఆటలో భాగంగా శిరీష్ చెక్క ముక్కను బయటకు తీస్తున్న సమయంలో టవర్ కూలిపోయింది. దీంతో అతను ఓటమి చెందాడు. ఈ ఫన్నీ వీడియోను షేర్ చేసిన శిరీష్.. సూర్య గ్రహణం సమయంలో సరిగా ప్రార్థించకపోతే ఇలానే జరుగుతోంది అని పేర్కొన్నారు.(చదవండి : ఫ్యాక్ట్ : నయన్-విఘ్నేశ్‌లకు కరోనా సోకిందా?)
ఇక, జెంగా ఆట విషయానికి వస్తే ఇందులో.. ముందుగా చెక్క ముక్కలను టవర్ మాదిరిగా పేర్చుతారు. ఈ ఆటను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆడతారు. ఈ ఆటలో పాల్గొనవారు టవర్ కూలిపోకుండా.. వంతుల వారీగా మధ్యలో ఉన్న ఒక్కో చెక్కముక్కను బయటకు తీసి పైభాగంలో పెట్టాలి. అయితే ఎవరు చెక్క ముక్క బయటకు తీసేటప్పుడు టవర్ కూలిపోతుందో వాళ్లు ఓటమి చెందినట్టు. అంతకుముందు ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి అల్లు అరవింద్‌కు శిరీష్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నేడు తన తల్లి నిర్మల పుట్టిరోజు సందర్భంగా విషెస్ చెప్పారు.