Anu Emmanuel Interesting Comments On Allu Sirish At Urvasivo Rakshasivo Press Meet - Sakshi
Sakshi News home page

Anu Emmanuel-Allu Sirish: అప్పటి వరకు అల్లు శిరీష్‌ ఎవరో కూడా తెలియదు: అను ఇమ్మాన్యుయేల్‌

Published Wed, Nov 9 2022 9:41 AM | Last Updated on Wed, Nov 9 2022 10:53 AM

Anu Emmanuel Interesting Comments on Allu Sirish in Press Meet - Sakshi

నటి అను ఇమ్మానుయేల్‌ కోలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడిందని చెప్పవచ్చు. టాలీవుడ్‌లో పలు చి త్రాల్లో నటించిన ఈమె తమిళంలో విశాల్‌కు జంటగా తుప్పరివాలన్‌ చిత్రంతో పరిచయం అయింది. ఆ చిత్రంలో ఈమె పాత్ర పరిమితమే. గుర్తింపు అంతంత మాత్రమే. ఆ తర్వాత శివ కార్తికేయన్‌కు జంటగా నమ్మవీటి పిళ్లై చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత కోలీవుడ్లో కనిపించలేదు. అయితే తాజాగా కార్తీకి జంటగా జపాన్‌ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది.

చదవండి: Anushka Shetty: ‘నేను యోగ టీజర్‌గా పనిచేశానని అందరికి తెలుసు.. కానీ అది ఎవరికి తెలియదు’

చిత్రం సోమవారం పూజా కార్య క్రమం చెన్నైలో ప్రారంభమైంది. కాగా అను ఇమ్మానుయేల్‌ గురించి ఇటీవల ఒక వదంతి వైరల్‌ అవుతోంది. ఈమె తెలుగులో అల్లు శిరీష్‌ జంటగా ఊర్వశివో.. రాక్షసివో చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌ గా ప్రదర్శింపబడుతుంది. ఇక్కడ వర కు బాగానే ఉంది. అసలు కథ ఏంటంటే అను ఇమాన్యుల్‌ నటుడు అల్లు శిరీష్‌తో ప్రేమాయణం అంటూ ప్రచారం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. దీనిపై స్పందించిన ఆమె తాను అనుకోకుండానే ఈ రంగంలోకి ప్రవేశించానని చెప్పింది. కొన్ని సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లోనూ ప్లాప్‌ చిత్రాల్లోనూ నటించానని చెప్పింది.

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే

తాజాగా తెలుగులో అల్లు శిరీష్‌ సరసన నటించడంతో ఆయనతో ప్రేమలో పడ్డట్టు వదంతులు పుట్టిస్తున్నారని చెప్పింది. ఇలాంటి వాటిని తాను అస్సలు పట్టించుకోనని, అయితే తన తల్లి ఏడ్చేసిందని తెలిపింది. దీంతో అమ్మ వేదన చూసి తనకు బాధ కలిగిందని చెప్పింది. నిజానికి ఊర్వశివో.. రాక్షసివో చిత్రం షూటింగ్‌కు ముందు అల్లు శిరీష్‌ గురించి తనకు తెలియదని ఆయన్ని చూసింది కూడా లేదని చెప్పింది. చిత్ర షూటింగ్‌ పూజ సమయంలోనే తాను అల్లు శిరీష్‌ను కలిశానని చెప్పింది. ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి కాఫీ తాగితే కూడా రకరకాలుగా కట్టు కథలను అల్లేస్తున్నారని నటి అను ఇమ్మానుయేల్‌ ఆవేదన వ్యక్తం చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement