Intriguing First Look of Allu Sirish's Upcoming Film Buddy - Sakshi
Sakshi News home page

ఆసక్తికరమైన టైటిల్‌తో అల్లు శిరీష్‌ కొత్త సినిమా!

Published Tue, May 30 2023 5:16 PM | Last Updated on Tue, May 30 2023 5:43 PM

Intriguing First Look of Allu Sirish Upcoming Film Buddy - Sakshi

మంచి  ఆసక్తికరమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో  అల్లు శిరీష్ ఇటీవల ‘ఊర్వశివో రాక్షసివో’ మంచి హిట్ అందుకున్నారు. ప్రేక్షకుల నుంచి ఈ మంచి రెస్పాన్స్ లభించింది.  సినిమాలో నటీనటుల నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు శిరీష్  కొత్త సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తాజా సమాచారం ఏమిటంటే, టాప్ ప్రొడక్షన్ బ్యానర్ స్టూడియో గ్రీన్‌పై శిరీష్ కొత్త చిత్రం త్వరలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రాబోతోంది. మేకర్స్ ఈరోజు సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ని విడుదల చేశారు. 

రిలీజ్ చేసిన పోస్టర్‌లో అల్లు శిరీష్ తుపాకీతో కనిపిస్తుండగా, టెడ్డీ బేర్ అతని పక్కన ఫైటింగ్ పొజిషన్‌లో నిలబడి ఉంది. బడ్డీ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. అల్లు శిరీష్ తన బడ్డీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత  జ్ఞానవేల్ రాజా నిర్మించారు. గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement