
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే మెగాహీరో అల్లు శిరీష్. తన అభిమానులు వేసే ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెబుతూ ఉంటారు. ఎప్పుడూ కూల్‌గా ఉండే అల్లు శిరీష్ ఓ విషయంపై అసహనం వ్యక్తం చేశారు. చూస్తుంటే ఆ విషయం ఏదో కానీ తనకు ఎక్కడ లేని కోపాన్ని తెచ్చిపెట్టినట్టుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.
అల్లు శిరీష్ ఈ మధ్యే ఎయిర్‌టెల్ నుంచి వోడాఫోన్ నెట్‌వర్క్‌కు మారారట. అయితే వోడాఫోన్ నెట్‌వర్క్ సర్వీస్ చాలా ఘోరంగా ఉందని, బ్యాడ్‌నుంచి వరెస్ట్‌కు వచ్చినట్టైందని ఆవేదన వ్యక్తం చేశారు. 4జీ సర్వీస్ వదిలేయండి, కనీసం 2జీ కూడా సరిగా పనిచేయడం లేదని, ఒక్కోసారి కాల్ డ్రాప్స్ అవుతున్నాయని, సిగ్నల్ కూడా ఉండటంలేదని వాపోయారు. ఈ విషయంపైనే ఈ మెగా హీరో ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలియదంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు. అల్లు శిరీష్ ప్రస్తుతం కన్నడ రీమేక్ ఏబీసీడీలో నటిస్తున్నారు.
"You'll never realise the value of something while you have it." Ported from Airtel to Vodafone. Its a move from bad to worse. Forget 4G, even 2G doesn't work most times. Forget call drops there's no signal only. Regret it! Lesson learnt. @VodafoneIN 😂😂😂
— Allu Sirish (@AlluSirish) June 21, 2018
Comments
Please login to add a commentAdd a comment