
Allu Sirish: టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ గాయపడ్డాడు. అయితే ఆయన గాయపడింది సినిమా షూటింగ్‌లో కాదు, వర్కవుట్ సమయంలో! ఈ మధ్య శిరీష్ ఫిట్‌నెస్ మీద బాగా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పటిలాగే వర్కవుట్స్ చేస్తుండగా ఆయన మెడకు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అతడే ఫొటోతో సహా స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు.
"ఇది ఫ్యాషన్ కోసం పెట్టుకుంది కాదు, స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు నిజంగానే మెడకు దెబ్బ తగిలింది" అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫొటో షేర్ చేశాడు. ఇందులో శిరీష్ మెడకు పట్టీ కట్టుకుని కనిపిస్తున్నాడు. ఇది చూసిన అభిమానులు అతడికి త్వరగా నయం కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మధ్యే హిందీ పాటతో అలరించిన శిరీష్ ప్రస్తుతం రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న "ప్రేమ కాదంట" సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇటీవలే రిలీజైన ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే!
Comments
Please login to add a commentAdd a comment