
మెగా హీరో, అల్లువారబ్బాయి అల్లు శిరీష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబిస్తుంటారు. ప్రస్తుతం ఈ హీరో మలయాళ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏబీసీడీగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే అల్లు శిరీష్ తాజాగా చేసిన ట్వీట్ అల్లు అర్జున్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
అల్లు అర్జున్ నటించిన 'ఆర్య 2' 2009లో ఇదే రోజు(నవంబర్ 27)న విడుదలైంది. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. ‘నేను సినిమాలు చూస్తూ ఎమోషన్ కి లోనైన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది 'ఆర్య 2' సినిమాలో అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం తన గొంతుపై కత్తి పెట్టుకున్న సీన్ చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. ఆ సీన్ చూసిన దగ్గర నుంచే అల్లు అర్జున్‌కి అభిమానినయ్యాను. 'ఆర్య', 'ఆర్య 2' ఈ రెండు సినిమాల్లోను ప్రేమ.. స్నేహం.. త్యాగం గురించి గొప్పగా చెప్పారు. అందుకే ఈ సినిమాలంటే నాకెంతో ఇష్టం’ అంటూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment