Buddy First Single: పాటతో రూమర్స్‌కి చెక్‌ పెట్టిన అల్లు శిరీష్‌! | Allu Sirish Buddy Movie First Single Out Aa Pilla Kanule Buddys Love Lyrical Song Video Released | Sakshi
Sakshi News home page

Buddy Movie First Song: పాటతో రూమర్స్‌కి చెక్‌ పెట్టిన అల్లు శిరీష్‌!

Published Wed, May 15 2024 4:56 PM | Last Updated on Wed, May 15 2024 6:14 PM

Allu Sirish Buddy Movie First Single Out

‘ఊర్వశివో రాక్షసీవో’(2022) తర్వాత అల్లు శిరీష్‌ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. ఆ సినిమా రిలీజైన కొన్నాళ్లకే బడ్డీ మూవీ అనౌన్స్‌ చేశాడు. చిన్న గ్లింప్స్‌ కూడా విడుదల చేశారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. ఒకనొక దశలో ఈ సినిమాను పక్కకు పెట్టేసినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఓ పాటను రిలీజ్‌ చేసి రూమర్స్‌ అన్నింటికి చెక్‌ పెట్టారు మేకర్స్‌. 

బుధవారం ఉదయం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'ఆ పిల్ల కనులే..' రిలీజ్ చేశారు. హిప్ హాప్ తమిళ ఈ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. సాయి హేమంత్ లిరిక్స్ అందించగా హిప్ హాప్ తమిళ తో కలిసి సంజిత్ హెగ్డే, ఐరా, విష్ణు ప్రియ రవి పాడారు. 'ఆ పిల్ల కనులే, చూశాక తననే ఊహల్లో ఎగిరే మైకంలో మునిగే , మైకంలో తేలే, మబ్బులు తాకే, ఇద్దరి కథ ఇక మొదలాయే, నింగి నేల కలిశాయో, ఊసులేవో పలికాయో..' అంటూ మంచి రొమాంటిక్ నెంబర్ గా సాగుతుందీ పాట.

శిరీష్‌, గాయత్రి భరద్వాజ్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు శామ్‌ ఆంటోన్‌ దర్శకత్వం వహించగా, స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.  చిత్రీకరణ పూర్తి చేసుకున్న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement