బాబాయ్‌తో కలిసి చిందులు.. | Allu Sirish Making Fun With His Brothers Children | Sakshi
Sakshi News home page

ఫన్‌ విత్‌ శిరి బాబాయ్‌..

Published Sun, May 17 2020 10:22 AM | Last Updated on Sun, May 17 2020 10:35 AM

Allu Sirish Making Fun With His Brothers Children - Sakshi

హైదరాబాద్‌ : హీరో అల్లు శిరీష్‌.. తన సోదరుల పిల్లలతో కలిసి సందడి చేశారు. అల్లు అర్జున్‌ పిల్లలు అయాన్‌, అర్హ, అల్లు వెంకట్‌ కుమార్తె అన్వితలతో కలిసి ఓ సాంగ్‌కు చిందేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బన్నీ భార్య స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ఫన్‌ విత్‌ శిరి బాబాయ్‌’ అని పేర్కొన్నారు. ఈ వీడియోలో అన్విత, అయాన్‌లు తమకు తోచిన స్టేప్పులు వేశారు. అర్హ మాత్రం పక్కన ఉన్న అయాన్‌, వెనకాల ఉన్న శిరీష్‌ ఏం చేస్తున్నారో చూసుకుంటూ.. చాలా క్యూట్‌ క్యూట్‌ స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

స్నేహారెడ్డి షేర్‌ చేసిన ఈ వీడియోపై శిరీష​ స్పందిస్తూ.. ‘2020లో అంకుల్‌ విధుల్‌ ఇవ్వే.. అందులో పిల్లలతో టిక్‌టాక్‌లు చేయించడం కూడా ఉంది’ అని పేర్కొన్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే.. శిరీష్‌ నటించిన చివరి చిత్రం ఏబీసీడీ విడుదలై నేటికి(మే 17) ఏడాది పూర్తి అయింది. అయితే ఇప్పటివరకు శిరీష్‌ తన తదుపరి చిత్రానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. (చదవండి : బుట్టబొమ్మకు పెదవి కలిపిన బుట్టబొమ్మ)

Fun with Siri Babai ❤️

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement