ఇండస్ర్టీలో హీరోయిన్లతో ప్రేమ విషయానికి వస్తే కొందరు హీరోలు గుర్తొస్తారు. కొన్నాళ్ల పాటు వారి లవ్ స్టోరీ ఇండస్ర్టీ మొత్తం హాట్ టాపిక్ అవుతోంది. ఇంకొందరేమో అమ్మాయిలంటేనే చాలా దూరంగా ఉంటారు. ఈ కోవలోకే వస్తారు టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్. 2013లో ఇండస్ర్టీలోకి ఇచ్చిన ఈయనపై ఇప్పటి వరకు ఎలాంటి రూమర్స్ లేవు. అయితే తాజాగా శిరీష్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌తో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి.. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాల్లో నటించింది ఈ భామ.. ఇప్పుడు అల్లు శిరీష్‌తో ప్రేమలో ఉందని ఇండస్ట్రీలో వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి కొంతకాలంగా వీరి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్‌గా అల్లు శిరీష్ షేర్ చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. రెండు రోజుల క్రితం మార్చి28న నటి అను ఇమ్మాన్యుయేల్ పుట్టినరోజు కావడంతో అల్లు సిరిష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు.
లేట్‌గా విషెస్ చెబుతున్నానని నాకు తెలుసు..కానీ ఈ వీడియోతో రావడానికి లేట్ అయ్యింది. హ్యాపీ బర్త్‌డే సైకో అంటూ శిరీష్ విషెస్ చెప్పారు.ఎప్పుడూ సినిమాలు లేదా ఫిట్‌నెస్‌పై మాత్రమే దృష్టి పెట్టే శిరీష్..కొన్నాళ్లుగా అను ఇమ్మాన్యుయేల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించనున్నారని కూడా తెలుస్తుంది.ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తున్న మహా సముద్రం సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా, శిరీష్ ఓ సినిమాకు సైన్ చేసినట్లు సమాచారం.
చదవండి : వకీల్‌సాబ్ ట్రైలర్ లాంచ్.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ
దర్శకుడితో ప్రేమలో ప్రముఖ హీరోయిన్!
Comments
Please login to add a commentAdd a comment