
మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మరో మెగా వారసుడు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే మాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా జనతా గ్యారేజ్ సినిమాతో సత్తా చాటాడు. తాజాగా మరోయంగ్ హీరో కూడా మాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. అల్లు వారబ్బాయిగా వెండితెరకు పరిచయం అయిన హీరో శిరీష్. తొలి రెండు సినిమాలతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన శిరీష్, మూడో సినిమాగా తెరకెక్కిన శ్రీరస్తు శుభమస్తుతో మంచి విజయం సాధించాడు.
అదే ఊపులో ఇప్పుడు మాలీవుడ్ ఎంట్రీకి కూడా రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్కు కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో అది కూడా శిరీష్ ఎంట్రీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు మాలీవుడ్లో శిరీష్ తన తొలి సినిమానే సూపర్ స్టార్ మోహన్లాల్తో కలిసి నటిస్తుండటం విశేషం. మోహన్లాల్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ మూవీ '1971 బెయాండ్ బార్డర్స్' మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. 1971లో జరిగిన భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మేజర్ రవి దర్శకుడు.
So, I'm making my Malayalam debut in @Mohanlal sir's "1971 : Beyond Borders" directed by Major Ravi, based on 71 Ind-Pak war.
— Allu Sirish (@AlluSirish) 22 October 2016