
సాక్షి, సినిమా : టాలీవుడ్‌లో మరో ఆసక్తికర సబ్జెక్టుతో ఓ చిత్రం రాబోతుంది. శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన హీరో అల్లు శిరీష్.. ఎక్కడికి పోతావు చిన్నివాడా మరి గుర్తింపు పొందిన దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఒక్క క్షణం. ఈ చిత్ర టీజర్ కాసేపటి క్రితం విడుదలయ్యింది.
ఫేట్ వర్సెస్ డెస్టినీ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా టీజర్‌ను చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. రెండు సమకాలీన జీవితాలు, ఒకరి ఫాస్ట్.. మరోకరి ఫ్యూఛర్ మీద ఆధారపడి ఉండటం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు అర్థమౌతోంది. సస్పెన్స్‌తో కూడిన ఎలిమెంట్లు చూపించగా.. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టడానికి వెనకాడని యువకుడి పాత్రలో శిరీష్ నటించాడు.
సురభి, సీరత్ కపూర్‌లు హీరోయిన్లుగా, అవసరాల శ్రీనివాస్, జయప్రకాశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఒక్క క్షణం డిసెంబర్ చివర్లో విడుదల కానుంది.
Presenting the teaser of Okka Kshanam. Wondering if you also might be having a "parallel life" with someone? #OkkaKshanam https://t.co/SlpFoZtPnj
— Allu Sirish (@AlluSirish) December 3, 2017