సూర్య బర్త్ డేకి అల్లువారబ్బాయి ప్లాన్స్ | Allu sirish Hopes on Tamil | Sakshi
Sakshi News home page

సూర్య బర్త్ డేకి అల్లువారబ్బాయి ప్లాన్స్

Published Fri, Jul 21 2017 3:31 PM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM

సూర్య బర్త్ డేకి అల్లువారబ్బాయి ప్లాన్స్

సూర్య బర్త్ డేకి అల్లువారబ్బాయి ప్లాన్స్

మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో అల్లు శిరీష్. గౌరవం, కొత్త జంట సినిమాలతో నిరాశపరిచిన శిరీష్ తరువాత శ్రీరస్తు శుభమస్తు సినిమాతో సక్సెస్ సాధించాడు. ఈ సినిమా తరువాత మలయాళ ఎంట్రీ ఇచ్చిన శిరీష్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాతో మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు వారబ్బాయికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

ప్రస్తుతం ఎక్కడికీ పోతావు చిన్నవాడా ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్న శిరీష్ కోలీవుడ్ మీద దృష్టి పెట్టాడు. కోలీవుడ్ అభిమానులకు చేరువయ్యేందుకు సూర్య పుట్టిన రోజును ఉపయోగించుకుంటున్నాడు. ఈ నెల 23న సూర్య పుట్టిన రోజు సందర్భంగా సూర్య అభిమానులు అందరూ ఒకే ప్రొఫైల్ పిక్చర్ పెట్టాలంటూ కోరాడు.

ఓ ఫోటోతో పాటు సూర్యను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మలయాళ ఎంట్రీ పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటంతో ఇప్పుడు తమిళ ప్రేక్షకులకు చేరువయ్యేందుకే శిరీష్ ఇలా చేశాడన్న టాక్ వినిపిస్తుంది. మరి శిరీష్ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement