బన్నీ బాటలో శిరీష్..! | allu sirish has been offered a malayalam film | Sakshi
Sakshi News home page

బన్నీ బాటలో శిరీష్..!

Published Thu, Aug 4 2016 1:49 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

బన్నీ బాటలో శిరీష్..!

బన్నీ బాటలో శిరీష్..!

ఈ శుక్రవారం శ్రీరస్తు శుభమస్తు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న యంగ్ హీరో అల్లు శిరీష్. అన్న బాటలో నడవడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. గౌరవం సినిమాతో హీరోగా పరిచయం అయిన శిరీష్ తొలి సినిమాతో నిరాశపరిచాడు. తరువాత చేసిన కొత్త జంట సినిమా కూడా ఆకట్టుకోలేకపోవటంతో ఇప్పుడు శ్రీరస్తు శుభమస్తు మీదే ఆశలు పెట్టుకున్నాడు.

శ్రీరస్తు శుభమస్తు సినిమాలో స్టైలిష్ లుక్లో కనిపిస్తున్న శిరీష్కు మళయాల స్టార్ డైరెక్టర్ నుంచి పిలుపు వచ్చింది. మాలీవుడ్లో అల్లు అర్జున్కు భారీ స్టార్ ఇమేజ్ ఉండటంతో అది కూడా శిరీష్ మాలీవుడ్ ఎంట్రీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.అయితే ఈ ఆఫర్ గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్న శిరీష్, బైలింగ్యువల్ సినిమాలు చేసే ఆలోచన అయితే ఉందంటూ ప్రకటించాడు. మరి శిరీష్ మళయాల సినిమాకు ఓకె చెప్తాడో.. లేదో..? చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement