Allu Sirish Music Video: ఆనందంలో మునిగితేలుతున్న అల్లు శిరీష్‌ | Allu Arjun Congratulated To Allu Sirish - Sakshi
Sakshi News home page

ఆనందంలో మునిగితేలుతున్న అల్లు శిరీష్‌

Published Fri, Apr 16 2021 8:39 AM | Last Updated on Fri, Apr 16 2021 11:20 AM

Allu Arjun Congratulates Brother Allu Sirish For 100 M Views On Vilayati Sharaab  - Sakshi

అల్లు శిరీష్‌ ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఆయన తొలిసారి బాలీవుడ్‌లో నటించిన ‘విలయాటి షరాబి’ మ్యూజిక్‌ ఆల్భమ్‌ 100 మిలియన్‌ క్లబ్‌లోకి చేరిపోయింది. గతనెల చివర్లో యూట్యూబ్‌లో విడుదలైన ఈ స్పెషల్‌ వీడియో సాంగ్‌ ఇంటర్నెట్‌కు షేక్‌ చేసింది. అల్లు శిరీష్‌, హెలి దరువాలా జంటగా చేసిన ఈ సాంగ్‌ మ్యూజిక్‌ లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది.దీంతో రిలీజ్‌ అయిన తక్కువ కాలంలోనే వీడియోకు 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. 

ఈ సందర్భంగా తమ్ముడు సక్సెస్‌పై అల్లు అర్జున్‌ ఆనందం వ్యక్తం చేశారు. 'బిగ్‌ కంగ్రాట్‌ శిరీష్‌. నీ పాట వంద మిలియన్‌ వ్యూస్‌ని సాధించినందుకు గర్వంగా ఉంది' అంటూ అభినందించారు. ఇక ఊహించని ఈ సర్‌ ప్రైజ్‌కి అల్లు శిరీష్‌ సైతం ఆనందంలో మునిగితేలుతున్నాడు. ఈ పాట ఇంత సక్సెస్‌ అవుతుందని ఊహించలేదని, ఈ సాంగ్‌ కోసం కష్టపడ్డ ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు.


చదవండి : హీరోయిన్‌తో అల్లు శిరీష్ డేటింగ్‌ ? ఫోటోలు వైరల్
అల్లు స్నేహారెడ్డి ఐడియాకి సమంత ఫిదా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement