ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, హీరో అల్లు అర్జున్ సోదరుడు, హీరో శిరీష్ నిశ్చితార్థం హైదరాబాద్‌కి చెందిన నయనికతో జరిగింది
శుక్రవారం హైదరాబాద్‌లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, స్నేహితులు, బంధువులు హాజరై, శిరీష్–నయనికలకు శుభాకాంక్షలు తెలిపారు.
నిశ్చితార్థ వేడుకకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.


