
‘శైలజారెడ్డి అల్లుడు (2018)’ తర్వాత తెలుగులో కాస్త స్లో అయినట్లున్నారు హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్. మళ్లీ స్పీడ్‌ను అందుకోవాలనే ఆలోచనతో తాజాగా ఓ తెలుగు సినిమాకు అను సైన్ చేశారట. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్ హీరోగా పరిచయమైన ‘విజేత’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రాకేశ్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో అను హీరోయిన్‌గా నటించబోతున్నారని సమాచారం. ఇందులో అల్లు శిరీష్ హీరోగా నటిస్తారట. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారట శశి.
Comments
Please login to add a commentAdd a comment