Reason Behind Why Katrina Kaif To Change Her Name After Marriage With Vicky Kaushal - Sakshi
Sakshi News home page

Katrina Kaif Name Change: పెళ్లి తర్వాత కత్రీనా పేరు మార్చుకుంటుందా..?

Published Fri, Nov 19 2021 4:08 PM | Last Updated on Fri, Nov 19 2021 4:20 PM

Katrina Kaif Will Change Her Name After Wedding - Sakshi

Katrina Kaif Will Change Her Name After Wedding: బాలీవుడ్‌ జంట రాజ్‌ కుమార్‌ రావు, పత్రలేఖ వివాహం జరిగింది. ఇక ఇప్పుడు కొంచెం బ్రేక్‌ తీసుకోండి రాబోయే మరో గ్రాండ్‌ బాలీవుడ్‌ కపుల్‌ వెడ్డింగ్‌కు సిద్ధమవ్వండి. హా.. అదే కత్రీనా కైఫ్‌, విక్కీ కౌశల్‌ పెళ్లి గురించే. ఇప్పటికే కత్రీనా తన వివాహం కోసం దుస్తులను ఎంచుకోవడం ప్రారంభించింది. విక్కీ కౌశల్‌ వారి వివాహం తర్వాత ఉండటం కోసం ఖరీదైన ఇళ్లు కొనుగోలు చేశారు. అయితే వివాహం తర్వాత కత్రీనా కైఫ్‌ తన పేరును కత్రీనా కైఫ్‌ కౌశల్‌గా మార్చుకుంటుందా అని తాజాగా చర్చ జరుగుతోంది. పేరు మార్చుకునే అవకాశం ఉందని బీటౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. అలా అయితే సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'టైగర్‌ 3' చిత్రం పోస్టర్లు, ట్రైలర్‌లో కత్రీనా కైఫ్‌ కౌశల్‌ అని వస్తుందేమో చూడాలి.  

డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ హోటల్‌లో కత్రీనా, విక్కీ వివాహం కానుందని ప్రచారం జరుగుతున్నట్లు తెలిసిందే. ఈ షాదీ వివరాలు మెలిమెల్లిగా పాకి టైగర్‌ 3 సెట్స్‌లో ఓ ప్రశ్న తలెత్తిందట. కత్రీనా కైఫ్‌ తన పెళ‍్లి తర్వాత కత్రీనా కైఫ్‌ కౌశల్‌గా పేరు మార్చుకుంటుందా అని. కత్రీనా పేరులోని మొదటి అక్షరాలు కెకె (KK) అయితే, వివాహం తర్వాత కౌశల్‌ పేరులోని కె (K) జతగా మారి కెకెకె (KKK) అని కౌగిలించుకున్నట్లు అవుతుందని ఆమె స్నేహితులు చమత్కరిస్తున‍్నారట. 

అయితే ఈ విషయంలో నిర్ణయం పూర్తిగా ఆమెదే అని కత్రీనా సన‍్నిహితులు చెబుతున‍్నారు. కత్రీనా పేరు మార్చుకోవాలనుకుంటే టైగర్‌ 3 పోస్టర‍్లు, ట్రైలర్‌పై మేకర్స్‌ కత్రీనా కైఫ్ కౌశల్‌గా క్రెడిట్‌ ఇస్తారు. ఇంతకుముందు కరీనా కపూర్‌ తలాష్‌లో కరీనా కపూర్‌ ఖాన్‌గా మార్చుకున్నారు. ఐశ్వర్య రాయ్‌ కూడా, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌గా పేరు మార్చుకున్నారు. దీపికా పదుకొణె మాత్రం తన పేరును మార్చుకోలేదు.
చదవండి: విక్కీ, కత్రీనా పెళ్లి చేసుకునే హోటల్‌ చరిత్ర ఏంటో తెలుసా..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement