The Specialty Of Katrina Kaif Wedding Mehndi: పెళ్లి అంటే ఎన్నెన్నో కలలు కంటారు అమ్మాయిలు. ఆ వేడుకలో జరిగే ప్రతీ తంతు ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు. మెహందీ నుంచి హనీమూన్ దాకా, కాలి మెట్టెల నుంచి నుదిటిపై పాపడ బిళ్ల వరకు విభిన్నంగా, ఆసక్తికరంగా చేయాలని కోరుకుంటుంది మగువల మనసు. మరీ ఇక సెలబ్రిటీల విషయానికస్తే..! ప్రతీ ఫంక్షన్‌లో కొత్తగా కనపించేందుకు ఆరాటపడుతుంటారు. కొన్నిసార్లు సీనీ సెలబ్రిటీలు ఎలాంటి ఆర్భాటం లేకుండా వివాహాలు చేసుకున్న కూడా సందర్భాలు ఉన్నాయి. అలా ఏ అధికారిక ప్రకటన లేకుండా జరుగుతుందే బాలీవుడ్ తారలు కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ వివాహం. ఈ వేడుకల‍్లో కత్రీనా కైఫ్ వేసుకునే మెహందీ ప్రత్యేకత, దానికి ఎంత ఖర్చువుతుందే తెలుసుకుందాం.
ఇది చదవండి: పెళ్లి తర్వాత కత్రీనా పేరు మార్చుకుంటుందా..?
రాజస్థాన్ సవాయ్ మాధోపూర్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్‌లో కత్రీనా, విక్కీ కౌశల్ వివాహం జరగనుందని తెలిసిందే. అధికారికంగా వెల్లడవని ఈ వేడుకలు డిసెంబర్ 7 నుంచి 12 వరకు జరగనున్నాయి. అయితే తాజా నివేదికల ప్రకారం కత్రీనా తన కాళ్లు, చేతులకు వేసుకునే మెహందీ (హెన‍్నా) రాజస్థాన్‌లో ప్రసిద్ధిచెందిన 'సోజత్ మెహందీ'తో తయారు చేయబడిందట. సోజత్‌లోని కళకారులు ఎలాంటి రసాయనాలు లేకుండా చేతితో తయారు చేస్తారట. దీని విలువ సుమారు రూ. 50,000 నుంచి రూ. లక్ష వరకు ఉంటుందని సమాచారం.
ఇది చదవండి: విక్కీ, కత్రీనా పెళ్లి చేసుకునే హోటల్ చరిత్ర ఏంటో తెలుసా..?
అలాగే పలు నివేదికల ప‍్రకారం ఈ కార్యక‍్రమానికి సుమారు 125 మంది వీఐపీ అతిథులు హాజరవనున్నారు. ముంబై నుంచి ప్రయాణించే గెస్ట్‌లు మొదట జైపూర్‌లో దిగుతారు. వారికోసం భారీ లగ్జరీ బస్సులు, కార్లు కూడా బుక్ అయ్యాయని సమాచారం. ఈ పెళ్లిలో ప్రముఖ రాజస్థానీ వంటకాలు వడ్డించనున్నారట. ప్రత్యేకంగా 'కేర్ సంగ్రీ' వంటకం కూడా తయారు చేస్తున‍్నారని తెలుస‍్తోంది. ఈ వంటకాల కోసం వేడుక నిర్వాహకులు సవాయ్ మాధోపూర్‌లోని ప్రముఖ మిథైవాలా దుకాణంలో పనిచేసే కైలాశ్ శర్మ సహాయం తీసుకున్నారు. కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ జంట తమ వివాహంలో ఏస్ డిజైనర్ సభ్యసాచి వస్త్రాలను ధరించనున్నారని తెలిసిందే.
ఇది చదవండి: విక్కీ కౌషల్, కత్రీనా కైఫ్ ప్రేమ మందిరం.. పెళ్లి తర్వాత మకాం అక్కడేనా?
Comments
Please login to add a commentAdd a comment