రేస్‌లో ముందు! | Rashmika confirmed opposite Mahesh Babu! | Sakshi
Sakshi News home page

రేస్‌లో ముందు!

Published Fri, Mar 8 2019 3:19 AM | Last Updated on Fri, Mar 8 2019 3:19 AM

Rashmika confirmed opposite Mahesh Babu! - Sakshi

రష్మికా మండన్నా, మహేశ్‌బాబు

కామెడీ టైమింగ్‌లో మహేశ్‌బాబు టాలెంట్‌ ఏంటో ‘దూకుడు’ సినిమాలో ఫుల్‌గా చూశాం. స్క్రిప్ట్‌ను బట్టి ఇదే జోరును ఆ తర్వాత కొనసాగిస్తున్నారు మహేశ్‌. ఇక ‘ఎఫ్‌ 2’ సినిమాతో ప్రేక్షకులకు బాగా కితకితలు పెట్టారు అనిల్‌ రావిపూడి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా పట్టాలెక్కడానికి రంగం సిద్ధమవుతుందనే సంగతి తెలిసిందే. స్క్రిప్ట్‌లో ఫన్‌కి చాలా స్కోప్‌ ఉందట.

ప్రస్తుతం మహేశ్‌బాబు ‘మహర్షి’ సినిమా షూట్‌తో బిజీగా ఉన్నారు. మే 9న విడుదల కానున్న ఈ సినిమా ఒక కొలిక్కి రాగానే అనిల్‌ రావిపూడితో కలిసి సెట్స్‌కు వెళ్తారు మహేశ్‌బాబు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం సాయిపల్లవి, కత్రినా కైఫ్, రష్మికా మండన్నా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ ముగ్గురిలో రష్మికా మండన్నా రేస్‌లో ముందు వరుసలో ఉన్నారని తెలిసింది. రష్మికానే ఆల్మోస్ట్‌ ఒకే అయ్యారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement