
‘టైగర్ జిందా హై’ నిన్న ప్రపంచమంతా విడుదలైంది. రాజస్థాన్‌లోనే రిలీజ్ అవలేదు! థియేటర్‌లకు బాక్సులు చేరుకున్నాయి కానీ, ‘షో’ వేస్తే బాక్సు బద్ధలౌతుందని ‘వాల్మీకి’ కమ్యూనిటీ కర్రలు పట్టుకుని నిల్చుంది. సినిమాకు వ్యతిరేకంగా స్లోగన్లు ఇచ్చింది. వాల్‌పోస్టర్లు చింపేసింది. ఫస్ట్ అజ్మీర్‌లో మొదలైంది ప్రొటెస్ట్. తర్వాత జైపూర్‌కి, అక్కడి నుంచి కోట ప్రాంతానికి పాకింది. ఆగ్రహజ్వాలలు కదా, అలాగే స్పీడ్‌గా వ్యాపిస్తాయి.
సల్మాన్‌ఖాన్, కత్రీనా కైఫ్.. హీరో హీరోయిన్‌లు. హీరో గారు వాల్మీకి కమ్యూనిటీకీ వ్యతిరేకంగా సినిమాలో అయితే ఏమీ డైలాగులు కొట్టలేదు. మరి ఎక్కడ కొట్టారు? ఎప్పుడు కొట్టారు? రిలీజ్‌కు ముందు మూవీ ప్రమోషన్‌లో కొట్టాడట. ఏదో యాసలో మాట్లాడి! అదీ వీడియోలో. అది వైరల్ అయింది. రాజస్థాన్‌కు అంటుకుంది. మొన్న ‘పద్మావతి’, న్ని ్న ‘టైగర్ జిందా హై’! చివరికి రాజస్థాన్.. సినిమాలకు కూడా ఎడారి ప్రాంతం అయిపోతుందా?!
Comments
Please login to add a commentAdd a comment