
కోవిడ్ పరీక్ష చేయించుకుంటున్న కత్రినా
కోవిడ్ తర్వాత అన్నీ మారాయి. కొత్త విధానాలు అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి. సినిమాల చిత్రీకరణ మొదలెట్టాలంటే నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ కరోనా పరీక్ష చేయించుకోవాలి.. ఆ తర్వాతే పని ప్రారంభిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఓ కొత్త సినిమా చిత్రీకరణలో భాగంగా కరోనా టెస్ట్ చేయించుకున్నారు. పరీక్ష చేయించుకుంటున్న వీడియోను పంచుకుని– ‘‘జాగ్రత్త ముఖ్యం. షూట్ ముందు టెస్ట్ తప్పనిసరి’ అని పేర్కొన్నారు. కాగా ఈ పరీక్షలో కత్రినాకి కరోనా నెగెటివ్ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment