OTT Offers 100 Crore For Katrina Kaif And Vicky Kaushal Wedding Footage - Sakshi
Sakshi News home page

Katrina And Vicky Marriage: పెళ్లి ఫుటేజ్‌ కోసం రూ. 100 కోట్లు ఆఫర్‌.. ఎందుకో తెలుసా ?

Published Tue, Dec 7 2021 11:23 AM | Last Updated on Tue, Dec 7 2021 1:55 PM

OTT Offers 100 Crores For Katrina And Vicky Marriage Footage - Sakshi

OTT Offers 100 Crores For Katrina And Vicky Marriage Footage: పెళ్లి వేడుకలు, ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్‌ ఏం జరిగిన బాలీవుడ్‌ ఫిల్మ్‌ దునియాలో హాట్‌ టాపిక్‌ అవుతాయి. ప్రధానంగా స్టార్‌ కపుల్స్ వివాహం అంటే చాలు భారీ స్థాయిలో క్రేజ్‌ ఉంటుంది. ఎప్పుడూ వారి గురించి ఏం వార్త వస్తుందో అని ఎదురుచూస్తుంటారు. డేటింగ్ తర్వాత షాదీకి సిద్ధమైన హీరోహీరోయిన్లకు అభిమానుల్లో, వ్యాపార వర్గాల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. ఈ పెళ్లి వేడుకలను వ్యాపారంగా మార్చుకున్న బిజినెస్‌ కంపెనీలు కూడా ఉ‍న్నాయి. ఎవరైనా బాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ అనుమతిస్తే పైసా ఖర్చు లేకుండా పెళ్లి చేస్తామని ఆఫర్లు ఇచ్చే కంపెనీలు ఉన్నాయి. ఇక వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలకు మంచి బిజినెస్‌ ఉంటుందని చెప్పొచ్చు. 

తాజాగా కత్రీనా కైఫ్‌, విక్కీ కౌశల్‌ వివాహాన్ని స్ట్రీమింగ్‌ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ పోటీ పడుతోందని సమాచారం. ఈ వివాహానికి సంబంధించిన వీడియోలను రికార్డు చేసి, వీలు కుదిరితే విక్ట్రీనాలను ఇంటర్వ్యూ చేసి, అతిథుల అభిప్రాయాలను కూడా సేకరించి ఆ తర్వాత స్ట్రీమింగ్‌ చేసేందుకు విక్కీ, కత్రినాలతో సంప్రదింపులు జరిపిందని ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఏకంగా రూ. 100 కోట్లు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ స్టార్  సెలబ్రిటీకి దక్కని రేంజ్‌లో వీరికి ఈ బంపరాఫర్‌ ఇవ్వడం విశేషం. అందుకే మొబైల్స్‌ ఫోన్స్‌ తీసుకురాకుండా పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలకు కూడా కఠినమైన ఆంక్షలు విధించినట్లు బీటౌన్‌లో టాక్‌. ఏ ఒక్క ఫొటో, వీడియో బయటకు లీక్‌ కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు భోగట్టా. 

అయితే కత్రీనా గతంలోనే సల్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకుంటుందని అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ ఎమోషనల్‌గా వారి మధ్య బ్రేకప్ అయినట్లు ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు కత్రీనా మరొక హీరోను పెళ్లి చేసుకోబోతోంది అనడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్‌గా మారింది. అందుకే జనాలు కచ్చితంగా చూస్తారని ఫుటేజ్ కోసం పలు ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస‍్తోంది. 

ఇదీ చదవండికత్రీనా కైఫ్‌ వేసుకునే మెహందీ ప్రత్యేకత ఏంటో తెలుసా ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement