Sriram Raghavan Next Movie Without Interval With Vijay Sethupathi - Sakshi
Sakshi News home page

ఇంటర్వెల్‌ లేని విజయ్‌ సేతుపతి మూవీ!

Published Mon, Jan 25 2021 6:35 AM | Last Updated on Mon, Jan 25 2021 11:59 AM

Sriram Raghavan Next Movie with Katrina Kaif and Vijay Sethupathi - Sakshi

‘అంధాధున్‌’ తర్వాత దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ ఏ సినిమా చేస్తారనే ఆసక్తి ఉంది బాలీవుడ్‌కి. తమిళ నటుడు విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌ హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారాయన. ఇదో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అని సమాచారం. ఈ సినిమాను కేవలం 90 నిమిషాల నిడివితో తెరకెక్కించనున్నారట. అలాగే ఈ సినిమాకు ఇంటర్వెల్‌ కూడా ఉండదట. ఏప్రిల్‌ నెలలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారు. పూణె పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేస్తారు. ఒకే షెడ్యూల్‌లో సినిమా మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement