Katrina Kaif And Vicky Kaushal Marriage Date Fixed On Dec 9th 2021 - Sakshi
Sakshi News home page

Katrina Kaif-Vicky Kaushal Marriage: డిసెంబర్‌ మొదటి వారంలోనే పెళ్లి, ఫస్ట్‌ కోర్టులో వివాహం!

Published Sat, Nov 27 2021 12:58 PM | Last Updated on Sat, Nov 27 2021 1:38 PM

Katrina Kaif And Vicky Kaushal Wedding Date Fix On 9th December 2021 - Sakshi

Katrina Kaif And Vicky Kaushal Marriage Date: కొద్ది రోజులుగా బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ విక్కీ కౌశల్‌-కత్రినా కైఫ్‌ల పెళ్లి వార్తలు హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి. మొదటి నుంచి వీరి రిలేషన్‌ను గోప్యంగా ఉంచుతూ వస్తున్న ఈ జంట దీపావళి పండుగ సందర్భంగా సీక్రేట్‌ రోకా ఫంక్షన్‌ జరుపుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నుంచి వరుసగా వీరి పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వారి వివాహనికి సంబంధించిన అప్‌డేట్స్‌ను కూడా ఈ జంట సీక్రెట్‌గా ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో విక్కీ-కత్రినాల పెళ్లి తేదీ ఖరారైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా డిసెంబర్‌లో ఈ జంట మూడు మూళ్ల బంధంతో ఒక్కటవ్వబోతున్న సంగతి తెలిసిందే.

చదవండి: Disha Patani: దిశ పటానీకి సర్జరీ వికటించిందా?

తాజా వీరి వివాహని ముహుర్తం కూడా ఖరారైనట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని రిసార్ట్ అయిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో ఈ జంట వివాహ మహోత్సవ వేడుకను జరనుందని బి-టౌన్‌ జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే ఆ రోజే విక్కీ-కత్రినా పెళ్లి చేసుకోవ‌డం ప‌క్కా అంటూ క‌త్రినా కైఫ్ స‌న్నిహితులు చెబుతున్నారు. రాజస్థాన్‌లో జరిగే వీరి వివాహ కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 7, 8 తేదీల్లో సంగీత్, మెహందీ వేడుక జరగనున్నాయట. ఇక 9న ఈ జంట పెళ్లి జరగనుందని వినికిడి.

చదవండి: ముగ్గురు టాలీవుడ్‌ హీరోలు, సెలబ్రెటీలకు రూ. 200 కోట్లు కుచ్చు టోపి!

వెడ్డింగ్‌కు 200 మంది అతిధులు హాజరు కానున్నారని కూడా బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పెళ్లికి మరికొద్ది రోజులే మిగిలి ఉండడంతో సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. పెళ్లికి ఎవ‌రు మొబైల్స్ తీసుకురావొద్ద‌నే కండీష‌న్ పెట్టార‌నే ప్ర‌చారం కూడా న‌డుస్తుంది. అయితే వివాహానికి జైపూర్‌ పయనమయ్యే ముందు విక్కీ, కత్రినా వచ్చే వారం ముంబైలో కోర్టు వివాహం చేసుకుంటారని కత్రినా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కత్రినా, విక్కీ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సీక్రెట్ గా ఉంచాలని అనుకుంటున్నారట. అందుకనే ఇంకా పెళ్లి విషయాన్నీ కూడా అధికారికంగా ప్రకటించలేదని సమాచారం. 

చదవండి: కత్రీనా కైఫ్‌ వేసుకునే మెహందీ ప్రత్యేకత ఏంటో తెలుసా ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement