Marriage date
-
వరుణ్–లావణ్య త్రిపాఠి పెళ్లికి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే ???
-
వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి డేట్ ఫిక్సయ్యిందా?
మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగేందుకు డేట్ ఫిక్సయ్యిందా అంటే.. అవుననే టాక్ వినిపిస్తోంది. జూన్ 9న నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగింది. గత కొన్నేళ్లుగా లవ్ చేస్తున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఉంగరాలు మార్చుకున్నాడు. ఈ విషయం మెగా ఫ్యాన్స్‌కి పెద్ద సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ జంట పెళ్లి చేసుకోబోయే డేట్ ఇదేనని సోషల్ మీడియాలో ఓ టాక్ మొదలైంది. (ఇదీ చదవండి: మెగా ప్రిన్సెన్స్ 'క్లీంకార' ఫస్ట్ వీడియో.. చరణ్ చేతుల్లో అలా!) మెగాఫ్యామిలీలో బోలెడంత మంది హీరోలున్నారు. వాళ్లందరిలో సమ్‌థింగ్ డిఫరెంట్ ఉండే మూవీస్ చేస్తూ వరుణ్ తేజ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'గాండీవధారి అర్జున' అనే క్లాస్ యాక్షన్ చేస్తున్నాడు. ఇది ఆగస్టు 25న థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. మరోవైపు నిశ్చితార్థం చేసుకున్న వరుణ్-లావణ్య ఈ మధ్యే కాఫీ డేట్‌కి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని ఇన్ స్టాలో స్టోరీస్‌గా పెట్టారు. జూన్‌లో వీళ్ల ఎంగేజ్మెంట్ జరిగినప్పుడే.. ఈ ఏడాదిలో పెళ్లి ఉంటుందని టాక్ వినిపించింది. ఇప్పుడు ఏకంగా డేట్ ఇదేనంటూ ఒకటి బయటకొచ్చింది. ఆగస్టు 24న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే పెళ్లి షాపింగ్ కూడా మొదలుపెట్టేశారని సమాచారం. అయితే సినిమా రిలీజ్ పెట్టుకుని వరుణ్.. ఆగస్టులో మ్యారేజ్ చేసుకుంటాడా? లేదా ఇదే జస్ట్ రూమర్ మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) (ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్) -
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్
Aadhi Pinisetty And Nikki Galrani Wedding Date Fixed: యంగ్ హీరో ఆది పెనిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ ఇటీవల సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఎంతోకాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే వాటిపై ఎప్పుడు స్పందించని ఈ జంట వాటినే నిజం చేస్తూ మే 24న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని రెండు రోజులు ఆలస్యంగా ప్రకటిస్తూ తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. దీంతో వీరి పెళ్లి తేదీ కోసం ఆత్రుతుగా ఎదురు చూస్తున్నారు ఈ జంట ఫ్యాన్స్. చదవండి: అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురాం అయితే వీరి ఎంగేజ్మెంట్ జరిగి 15 రోజులు గడుస్తున్న ఇంకా పెళ్లిపై తేదీపై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ నేపథ్యంలో వారి పెళ్లికి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం ఈ జంట వివాహ తేది ఖరారైందని, ఈ నెల 18న మూడు మూళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఈ లవ్‌బర్డ్స్ త్వరలోనే వారి పెళ్లి తేదీని అనౌన్స్ చేస్తారా? లేక ఎంగేజ్మెంట్ తరహాలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంటారా? తెలియాలంటే కొద్ది రోజులు వేయిట్ చేయాల్సిందే. చదవండి: అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురాం ‘యాగవరైనమ్ నా కక్కా’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి-నిక్కీ తొలిసారి జంటగా నటించారు. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. అప్పటి నుంచి వీరిద్దరు సీక్రెట్‌గా లవ్‌ఎఫైర్ నడిపించారు. ఇదిలా ఉంటే ‘గుండెల్లో గోదారి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ఆది పినిశెట్టి. ‘సరైనోడు’,‘నిన్ను కోరి’,'రంగస్థలం' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల గుడ్ లక్ సఖి చిత్రంలో నటించిన ఆది ప్రస్తుతం రామ్ పోతినేని ద్విభాష చిత్రం ది వారియర్లో ప్రతి కథానాయకుడిగా నటించాడు. -
పెళ్లి తేదీ వాయిదా వేసుకున్న లవ్‌బర్డ్స్! కారణం ఇదేనా?
Alia Bhatt, Ranbir Kapoor Wedding Date Postponed: ఎట్టకేలకు బాలీవుడ్ లవ్‌బర్డ్స్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి హజరయ్యే బాలీవుడ్ సెలబ్రెటీలు వీరేనని, అందులో దీపికా పదుకొనె కూడా ఉందంటూ బీ-టౌన్లో గుసగుసలు కూడా మొదలయ్యాయి. ఇక వధువరులు ధరించే పెళ్లి బట్టలు, నగలు దగ్గరి నుంచి వీరి వివాహ వేదిక వరకు అన్నింటిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఏప్రిల్ 13న మహెందీ, హల్దీ వేడుకలు జరగనుండగా.. ఏప్రిల్ 14 లేదా 15వ తేదీల్లో పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: బన్నీ అలా అంటాడని ఊహించలేదు: ఉపేంద్ర అయితే వీరి పెళ్లి తేదీపై మాత్రం ఖచ్చితమైన సమాచారం లేదు. అంతేకాదు ఈ వార్తలపై ఇప్పటికీ ఈ జంట కానీ కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు. ఈ క్రమంలో ఈ లవ్‌బర్డ్స్ తమ పెళ్లి తేదీని వాయిదా వేసుకుందంటూ తాజాగా వార్తలు గుప్పుమన్నాయి. ఎలాంటి హడావుడి లేకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటీకి ఎలాగోలా అది బయటకు వచ్చిది. అంతేకాదు పెళ్లి ముహుర్తం నుంచి అరెంజ్మెంట్స్ వరకు అన్ని మీడియా చెవిన పడ్డాయట. దీంతో ఇరు కుటుంబాలపై ఒత్తిడి పడే అవకాశం ఉందని, అలాగే సెక్యురిటీ దృష్ట్యా కూడా పెళ్లి తేదీని ఏప్రిల్ 20కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. చదవండి: పెద్దపల్లి జిల్లాగోదావరి ఖనిలో నాని మూవీ షూటింగ్ స్వయంగా ఈ కొత్త పెళ్లి తేదీపై అలియా కజిన్(స్టెప్ బ్రదర్) రాహుల్ క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన రాహుల్ అలియా-రణ్‌బీర్ పెళ్లి విషయంపై స్పందించాడు. ‘నిజానికి వీరి పెళ్లి ఏప్రిల్ 14, 15 తేదీలలో జరపాలని అనుకున్నారు. అంతా బాగుంటే ఈ తేదీల్లోనే వారి పెళ్లి జరగాల్సింది. అయితే దీనిపై ఎంత గొప్యత పాటించిన ఇది బయటకు వచ్చింది. దీంతో సెక్యురిటీ దృష్ట్యా మహెందీ, హల్ది, నుంచి మిగిలి కార్యక్రమాలన్నింటిలో మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో పెళ్లి ఏప్రిల్ 20వ తేదీన జరిగే అవకాశం ఉంది’ అని అతడు చెప్పుకొచ్చాడు. -
ఫిక్సైన విక్కీ-కత్రినా పెళ్లి తేదీ, దానికి ముందు ముంబైలో కోర్డు వివాహం!
Katrina Kaif And Vicky Kaushal Marriage Date: కొద్ది రోజులుగా బాలీవుడ్ లవ్‌బర్డ్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌ల పెళ్లి వార్తలు హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి. మొదటి నుంచి వీరి రిలేషన్‌ను గోప్యంగా ఉంచుతూ వస్తున్న ఈ జంట దీపావళి పండుగ సందర్భంగా సీక్రేట్ రోకా ఫంక్షన్ జరుపుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నుంచి వరుసగా వీరి పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వారి వివాహనికి సంబంధించిన అప్డేట్స్ను కూడా ఈ జంట సీక్రెట్‌గా ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో విక్కీ-కత్రినాల పెళ్లి తేదీ ఖరారైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా డిసెంబర్లో ఈ జంట మూడు మూళ్ల బంధంతో ఒక్కటవ్వబోతున్న సంగతి తెలిసిందే. చదవండి: Disha Patani: దిశ పటానీకి సర్జరీ వికటించిందా? తాజా వీరి వివాహని ముహుర్తం కూడా ఖరారైనట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని రిసార్ట్ అయిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో ఈ జంట వివాహ మహోత్సవ వేడుకను జరనుందని బి-టౌన్ జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే ఆ రోజే విక్కీ-కత్రినా పెళ్లి చేసుకోవడం పక్కా అంటూ కత్రినా కైఫ్ సన్నిహితులు చెబుతున్నారు. రాజస్థాన్‌లో జరిగే వీరి వివాహ కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 7, 8 తేదీల్లో సంగీత్, మెహందీ వేడుక జరగనున్నాయట. ఇక 9న ఈ జంట పెళ్లి జరగనుందని వినికిడి. చదవండి: ముగ్గురు టాలీవుడ్ హీరోలు, సెలబ్రెటీలకు రూ. 200 కోట్లు కుచ్చు టోపి! వెడ్డింగ్‌కు 200 మంది అతిధులు హాజరు కానున్నారని కూడా బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పెళ్లికి మరికొద్ది రోజులే మిగిలి ఉండడంతో సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. పెళ్లికి ఎవరు మొబైల్స్ తీసుకురావొద్దనే కండీషన్ పెట్టారనే ప్రచారం కూడా నడుస్తుంది. అయితే వివాహానికి జైపూర్ పయనమయ్యే ముందు విక్కీ, కత్రినా వచ్చే వారం ముంబైలో కోర్టు వివాహం చేసుకుంటారని కత్రినా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కత్రినా, విక్కీ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సీక్రెట్ గా ఉంచాలని అనుకుంటున్నారట. అందుకనే ఇంకా పెళ్లి విషయాన్నీ కూడా అధికారికంగా ప్రకటించలేదని సమాచారం. చదవండి: కత్రీనా కైఫ్ వేసుకునే మెహందీ ప్రత్యేకత ఏంటో తెలుసా ? -
సంక్రాంతికి ముందే సింగర్ సునీత పెళ్లి!
తన గాత్ర మాధుర్యంతో అభిమానులను ఓలలాడించే సింగర్ సునీత వైవాహిక జీవితం గురించి ఎన్నో పుకార్లు వచ్చాయి. కానీ ఏనాడూ ఆమె వాటిని పట్టించుకోలేరు. అయితే ఓ షోలో మాత్రం తన భర్త వల్ల ఇబ్బందిపడుతున్న విషయాన్ని బయట పెట్టారు. పిల్లలను తనే పెంచి పోషిస్తున్నట్లు తెలిపారు. ఒంటరిగానే జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఆమె వైవాహిక జీవితం గురించి వస్తున్న రూమర్లకు పుల్‌స్టాప్ పెట్టేశారు. కాగా సింగిల్ పేరెంట్‌గా పిల్లల బాధ్యత చూసుకుంటున్న ఆమె ఇటీవలే రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. (చదవండి: సునీత ప్రీ వెడ్డింగ్.. హాజరైన రేణు దేశాయ్) (సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఇన్విటేషన్ కార్డు) మ్యాంగో మీడియా గ్రూప్ హెడ్ రామ్ వీరపనేనితో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. జనవరి 9న సునీత, రామ్‌ల పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. దీంతో ఈ జంట సంక్రాంతికి ముందే ఏడడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ కార్యక్రమానికి కేవలం ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు మాత్రమే హాజరు కాబోతున్నారట. అందువల్ల సినీ సెలబ్రిటీల కోసం సునీత నేడు ప్రీవెడ్డింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా ఇటీవలే గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో సునీత-రామ్ ఓ స్పెషల్ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి టాలీవుడ్ నటీనటులతో పాటు టాప్ సింగర్స్ కూడా హాజరయ్యారు. సునీతకు కాబోయే భర్త రామ్‌కు నితిన్ కూడా అత్యంత సన్నిహితుడు కావడంతో దగ్గరుండి ఈ వేడుకను జరిపించినట్లు సమాచారం. (చదవండి: పెళ్లికి సిద్ధమవ్వనున్న మరో బాలీవుడ్ జంట) -
రానా పెళ్లి తేదీ ఖరారు
-
ఆగస్టులోనే రానా పెళ్లి
హీరో రానా తన ప్రేమికురాలు మిహికా బజాజ్‌తో ఏడడుగులు వేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 8న వీరి వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. అయితే కరోనా నేపథ్యంలో నిర్ణయించిన తేదీకి పెళ్లి జరుగుతుందా? లేదా? వాయిదా పడనుందట వంటి మాటలు వినిపిస్తున్నాయి. పెళ్లి తేదీలో ఎలాంటి మార్పు ఉండదని, ముందుగా అనుకున్నట్టు ఆగస్టు 8న జరుగుతుందని దగ్గుబాటి కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్‌లోనే ఈ వేడుక జరగనుంది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ఈ పెళ్లి వేడుకను నిర్వహించేందుకు దగ్గుబాటి, బజాజ్ కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 6, 7 తేదీల్లో ప్రీ–వెడ్డింగ్ సెలబ్రేషన్స్, 8న పెళ్లి జరగనున్నాయి. -
ముహూర్తం కుదిరిందా ?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్‌కి పెళ్లి ఘడియలు సమీపించాయన్న వార్తలు బీటౌన్‌లో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ముహూర్తం డేట్స్, ప్లేస్ కూడా ఫిక్స్ అయ్యాయని బాలీవుడ్ ఖబర్. తన బాయ్‌ఫ్రెండ్ ఆనంద్ అహుజాతో స్విట్జర్లాండ్‌లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట సోనమ్‌కపూర్. మే 11, 12 తేదీల్లో ఆనంద్–సోనమ్‌ల వివాహం జరగనుందనీ, అందుకు ఏర్పాట్లు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారని సమాచారం. బీటౌన్ ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీ కాస్త పెద్దదే. బోనీకపూర్, సంజయ్ కపూర్, అనిల్ కపూర్ వంటి బిగ్ సినీ సెలబ్రిటీలతో పాటు అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ వంటి కుర్రకారు ఉన్నారు. సో.. కపూర్ ఫ్యామిలీ అంతా మ్యారేజ్ టైమ్‌కి మూవీ షూటింగ్స్‌కు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకుంటున్నారని బాలీవుడ్ టాక్. ఆనంద్ అహుజా ఫ్యామిలీ మెంబర్స్, కపూర్ ఫ్యామిలీ మెంబర్స్ కొందరు ఢిల్లీ నుంచి, మరికొందరు ముంబై నుంచి స్టారై్ట స్విట్జర్లాండ్ చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారని బీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. -
దీపికా పదుకొనె పెళ్లి డేట్ ఫిక్స్!
ప్రేమ పక్షులు దీపికా పదుకొనే, రణవీర్ సింగ్‌ల వివాహానికి సబంధించిన వార్తలు ఇప్పటికే చాలా సార్లు వినిపించాయి. తాజాగా మరో సారి ఈ జంట ఒక్కటవ్వబోతుందన్న వార్త తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జోడి ఈ ఏడాదిలోనే ఒక్కటవ్వాలని భావిస్తున్నారట. దీపికా తల్లిందండ్రులు పెళ్లి తేదిని ఖరారు చేసినట్లు ఓ జాతీయ పత్రిక పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్, డిసెంబర్ల మధ్య ఉన్న నాలుగు తేదీలను చూశారని, వాటిలో ఒక తేదిని ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం. పెళ్లి కోసమై ఈ అమ్మడు తన చెల్లి, అమ్మతో కలిసి షాపింగ్ కూడా మొదలు పెట్టిందట. ఈ విషయంపై రణవీర్ ఓ మీడియా సమావేశంలో స్పందిస్తూ.. ‘ఈ విషయం ఎవరు బయటపెట్టారో నాకు తెలియదు. కానీ మా ఆలోచన మాత్రం అదే. పెళ్లి సంబంధించిన పనులను మొదలుపెట్టాం. వీలైనంత తొందరలో మా పెళ్లి జరుగుతుంది. కానీ ఇంకా డేట్ ఫిక్స్ కాలేద’ని తెలిపారు. కాగా దీపికా పదుకోనె త్వరలో విశాల్ భరద్వాజ్ చిత్రంలో నటించనుంది. రణవీర్ సింగ్.. జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్న 'గుల్లీ బాయ్’ తో పాటు రోహిత్ శెట్టి దర్శకత్వంలో సింబా చిత్రాల్లో నటిస్తున్నారు. -
నాగ చైతన్య పెళ్లి డేట్ రివీల్
హైదరాబాద్: ఎప్పటినుంచో ఊరిస్తున్న మోస్ట్ లవబుల్ పెయిర్ అక్కినేని నాగ చైతన్య- సమంతల పెళ్లికి ముహూర్తం ఖరారైనట్టే కనిపిస్తోంది. జనవరిలో ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట 2017 చివరిలో పెళ్ళి పీటలెక్కుతారని తరచూ అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఎపుడు అనే సస్పెన్స్ మాత్రం అభిమానులను వీడడంలేదు. ఎట్టకేలకు చైతు-సామ్స్పెళ్లి తేదీ రివీల్ అయింది. తాజాగా సౌత్ ఫిలిం ఫేర్ అవార్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కి హాజరైన చైతూ తన మ్యారేజ్ డేట్ అక్టోబర్ 6 అని అఫీషియల్ గా ప్రకటించినట్టు ఫిలింఫేర్ అవార్డ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అక్టోబర్ 6 ఈజ్ బిగ్ డేట్ అని ట్వీట్ చేసింది. జూన్17న హైదరాబాద్ లో జరగనున్న 64వ జియో ఫిలింఫేర్ అవార్డ్స్(సౌత్) నిర్వహించనున్న సందర్భంగా జరిగిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా హాజరైన చేతూ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్...అక్టోబర్ 6 అంటూ సిగ్గుల మొగ్గ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు మంచి రొమాంటిక్ ఫిలిం లభిస్తే.. సమంతతో కలిసి పనిచేయడం తనకు సంతోషమేనని ప్రకటించారు. జితేష్ పిళ్లై, రిలయన్స్ జియో తెలంగాణా సీఈవో కెసీ రెడ్డి తరుతరులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. .@chay_akkineni reveals his wedding date at the #JioFilmfareAwards (South) press con. October 6 is the big day! pic.twitter.com/BoXUWdxDio — Filmfare (@filmfare) June 8, 2017 -
ప్రముఖ దర్శకుడి పెళ్లి తేదీ ఇదే!
తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్లో ప్రస్తుతం వెడ్డింగ్ సీజన్ నెలకొంది. ముఖ్యంగా ప్రతిభావంతులైన దర్శకులంతా వరుసగా బ్యాచ్‌లర్ జీవితానికి చరమగీతం పాడి.. వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే దర్శకులు క్రిష్, హను రాఘవపూడి పెళ్లిలు చేసుకొని ఓ ఇంటి వారు అయ్యారు. తాజాగా ఈ జాబితాలోకి 'మనం', 'ఇష్క్', '24' చిత్రాల దర్శకుడు విక్రమ్ కే కుమార్ కూడా చేరబోతున్నారు. '24' సినిమాకు సౌండ్ ఇంజినీర్‌గా పనిచేసిన శ్రీనిధిని విక్రమ్ ప్రేమించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి వివాహ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వచ్చే నెల 4న శ్రీనిధిని చెన్నైలో విక్రమ్ కే కుమార్ పెళ్లి చేసుకోబోతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. చెన్నైలోని హిల్టన్ హోటల్లో అంగరంగ వైభవంగా జరగనున్న వీరి వివాహానికి నాగార్జున, ఏఆర్ రహమాన్, సూర్య, శ్రియ శరణ్, నిత్యా మీనన్, సమంత, మాధవన్ వంటి దక్షిణాది సినీ ప్రముఖులు పలువురు రానున్నట్టు సమాచారం. విక్రమ్ కే కుమార్ పెళ్లిముహూర్తం నిశ్చయమవ్వడంతో శుభలేఖలు అచ్చువేయించి బంధుమిత్రులకు అందజేస్తున్నట్టు తెలుస్తున్నది. 'మనం', 24 వంటి విభిన్న సినిమాలు అందించిన విక్రమ్ కే కుమార్ ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం స్క్రిప్ట్ పనుల్లో అతను బిజీగా ఉన్నట్టు సమాచారం.